Swachh Andhra:రాష్ట్రంలోని 123 మున్నిపాలిటీల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై ఇప్పటికే నిషేధం అమలులో ఉన్నప్పటికీ తొలివిడతగా 17 ప్రధాన కార్పోరేషన్లలో అత్యంత కఠినంగా నిషేధాన్ని అమలు చేయనున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాబిరాం తెలిపారు.
పర్యావర ణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణ హితమైన ఉత్పత్తులను సామాన్యులకు అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. పర్యావరణానికి మేలు చేసే ఉత్పత్తుల తయారీదారులైన మెప్మా, సెర్ప్ సంస్థలను సమన్వయం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా సంఘాలకు ఈబయోడిగ్రేడబుల్ ఉత్పత్తుల మార్కెటింగ్ బాద్యతలు అప్పగిస్తామన్నారు. స్వయం అనే బ్రాండ్ పేరుతో త్వరలో బయోడిగ్రేడబుల్ ఉత్పత్తులను ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు చెప్పారు.
Read also: Vijayawada News: సిఆర్ మీడియా అకాడమీ కొత్త కార్యదర్శిగా తేళ్ళ కస్తూరి బాధ్యతలు
Ban on Single-Use Plastics in Andhra Pradesh
Swachh Andhra:స్వయం బ్రాండ్ పేరుతో పర్యావరణహిత ఉత్పత్తులు
వీటి విక్రయాల వల్ల పర్యావరణానికి మేలు కలగటంతోపాటు, మహిళా సంఘాలు ఆర్దికంగా బలోపేతం అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేసారు. ప్లాస్టిక్ నిషేధాన్ని అడ్డుపెట్టుకుని వ్యాపారులు ధరలను పెంచకుండా చర్యలు తీసుకుంటామన్నారు. స్వయం ఉత్పత్తుల్లో పూర్తిస్థాయి నాణ్యతా ప్రమాణాలు పాటించటంతోపాటు, సరసమైన ధరలకు విక్రయిస్తామన్నారు. ప్లాస్టిక్ స్థానంలో బయోడిగ్రేడబుల్ ఉత్పత్తులు తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్టార్ హోటల్స్ అసోసియేషన్ రాష్ట్రఅధ్యక్షులు ఆర్.వి.స్వామి, విజయవాడ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామారావులు పూర్తి మద్దతు ప్రకటించారు. బయోడిగ్రేడబుల్ కవర్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వాటిపై ఉన్న 18శాతం జిఎస్టీని 5శాతానికి తగ్గించాలని విజప్తి చేసారు. రాష్ట్రంలో వినియోగిస్తున్న ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో 90శాతం ఇతర రాష్ట్రాల నుండి వస్తున్నాయని, బయోడిగ్రేడబుల్ ఉత్పత్తులను రాష్ట్రంలోనే తయారు చేయగలిగితే ఆదాయం రావటంతోపాటు, యువతకు ఉద్యోగాలు లబిస్తాయని తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

