Penna Hobila temple: లక్ష్మినరసింహస్వామి కొలువై ఉన్న ఎంతో ప్రసిద్ధి చెందిన పెన్నహోబిళ క్షేత్రాన్ని అటు ఆధ్యాత్మికంగా ఇటు పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పలు సూచనలు చేశారని దేవాదాయ ధర్మాదాయశాఖ రాష్ట్ర కమీషనర్ కె.రామచంద్రమోహన్ తెలిపారు.
సోమవారం మధ్యాన్నం ఆయన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిళంలో పర్యటించారు. కమీషనర్ ఆలయానికి చేరుకోగానే ఆలయ కార్యనిర్వహణ అధికారి సాకే రమేష్బాబు, ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మెన్ రేగటి నాగరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ అర్చకులతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. తొలుత లక్ష్మినరసింహస్వామి వారికి దర్శించుకున్న కమీషనర్ ప్రత్యేక పూజలు, అర్చనలు చేయించగా ఆయనకు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందించి ఘనంగా సత్కరించారు.
Read also: Yoga andhra 2026: జూన్ 7 నుంచి యోగా కార్యక్రమాలు
Devotees at Penna Hobila temple development
Penna Hobila temple: ఆలయ ప్రాంగణంలో నూతన నిర్మాణాల పరిశీలన
అనంతరం కమీషనర్ కె.రామచంద్రమోహన్ దేవాదాయశాఖ కర్నూల్ డిప్యూటీ కమీషనర్ఎం .రామాంజినేయులు, జిల్లా దేవాదాయశాఖ అధికారి గంజి మల్లికార్జున ప్రసాద్ తదితరులతో కలిసి ఆలయ పరిసరాలు, అభివృద్ధి పనులు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి తన వెంట ఉన్న దేవాదాయశాఖ ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. ఆలయ నాలుగు రాజగోపురాల పునః నిర్మాణం, ప్రకారము, సాలహారం, భక్తుల సౌకర్యార్థo నీటి వసతి కొరకు ఓవర్హ్వెడ్ ట్యాంకులు, వసతి గదులు, మరుగుదొడ్లు తదితరాల నిర్మాణాలు చేపట్టడం కోసం నిషితంగా ఆయా అంశాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆలయ పరిసరాల్లో, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఆలయానికి వచ్చే భక్తులు అత్యంత సౌకర్యవంతంగా, సంతృప్తికరంగా స్వామివారి దర్శనం కల్పించాల్సిన బాధ్యత మనపైనే ఉందని అందుకు తగ్గటు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ సిబ్బంది, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.
Epaper: epaper.vaartha.com
సిఆర్ మీడియా అకాడమీ కొత్త కార్యదర్శిగా తేళ్ళ కస్తూరి బాధ్యతలు

