Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సిఆర్ మీడియా అకాడమీ కొత్త కార్యదర్శిగా తేళ్ళ కస్తూరి బాధ్యతలు

సిఆర్ మీడియా అకాడమీ కొత్త కార్యదర్శిగా తేళ్ళ కస్తూరి బాధ్యతలు

వార్త 3 weeks ago

Vijayawada News: సి.ఆర్. మీడియా అకాడమీ కార్యదర్శిగా తేళ్ళ కస్తూరి బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని అకాడమీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆమె బ్యాదతలు స్వీకరించారు.

కార్యదర్శిగా పనిచేస్తున్న మణిరామ్ పదవీవిరమణ చేయటంతో జోన్-3లో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న కస్తూరికి కార్యదర్శిగా పూర్తిస్థాయిలో అదనపు బ్యాదతలు కల్పిస్తూ సమాచారశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేసారు. ఈమేరకు కార్యదర్శిగా కస్తూరి బాధ్యతలు స్వీకరించారు. అకాడమీ మేనేజర్ భాస్కరనారాయణ అకాడమీలో అమలు అవుతున్న పలు కార్యక్రమాలను కస్తూరికి వివరించారు. మీడియా అకాడమి మాజీ కార్యదర్శి బాలగంగాధర తిలక్ తదితరులు కస్తూరిని అభినందించారు.

Read also: AP DSC Sports Quota: డిఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలు.. 382 మంది అభ్యర్థుల ఎంపిక పూర్తి

Vijayawada News: కార్యాలయ పనుల పైన అవగాహన

బాధ్యతలు చేపట్టిన వెంటనే అకాడమీ మేనేజర్ భాస్కరనారాయణ ఆమెను కలిశారు. అకాడమీ పరిధిలో జరుగుతున్న వివిధ రకాల కార్యక్రమాల గురించి వివరించారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాలు, మీడియా అకాడమీ ప్రాధాన్యతలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి ఆమె ఆరా తీశారు. సిబ్బందితో కలిసి అకాడమీ లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు వెళ్లాలని ఆమె సూచించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

జూన్ 7 నుంచి యోగా కార్యక్రమాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha