RRR Road Construction Updates: రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారు.
శుక్రవారం ప్రభుత్వ సెలవు దినం అయినప్పటికీ నయాబ్ తహసీల్దార్ సూరేపల్లి అనుదీప్ సిబ్బందిని వెంట బెట్టుకుని వెళ్లి ఆర్ఆర్ఆర్లో భూములు కోల్పోతున్న శివంపేట, వెండికోలు, లింగంపల్లి, వెం కటకిష్టాపూర్, కోర్పోలు గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లోని 581 మంది రైతులకు నోటీసులు జారీ చేశారు. అయితే, గతంలో ఇదే రైతులుకు నోటీసులు అందజేసేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు కదులుతుండటంతో క్షేత్ర స్థాయిలో భూసేకరణ పనులను వేగవంతం చేస్తున్నారు.
Read Also: Yennam Srinivas Reddy Comments: హరీష్ రావు మంచి మిత్రుడు..
RRR Road Construction Updates: 581 మందికి రెవెన్యూ అధికారుల హెచ్చరిక
ఇందులో భాగంగానే నయాబ్ తహసీల్దార్ అనుదీప్ అధ్వర్యంలో సిబ్బంది ఆయా గ్రామాల్లో 298.23 ఎకరాలు పట్టా భూములు కోల్పోతున్న 581 మంది రైతులకు చివరి సారిగా నోటీసులు అం దజేశారు. నష్టపరిహారం చెల్లింపు విషయమై రైతులు పలు సందేహం నెలకొన్నది. గ్రామ సభలు నిర్వహించి చెక్కులు అందజేస్తారా లేక రైతుల బ్యాంకు అకౌంట్లలోకి నేరుగా పరిహారం డబ్బులు వేస్తారా అన్న సందిగ్ధత ఏర్పడింది. భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఎకరాకు ఎంత చెల్లిస్తున్నారో ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు గందరగోళానికి గురవుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

