Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్జీ కర్ బాధితురాలి తల్లి రత్న దేబ్‌నాథ్ ముందంజ!

ఆర్జీ కర్ బాధితురాలి తల్లి రత్న దేబ్‌నాథ్ ముందంజ!

వార్త 1 month ago

West Bengal Election Results: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పానిహతి నియోజకవర్గంపై అందరి దృష్టి నెలకొంది. ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వైద్యురాలి తల్లి రత్న దేబ్‌నాథ్ ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, ప్రారంభ రౌండ్లలో తన ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.

Read Also : Election Results: బెంగాల్, అస్సాంలో బీజేపీ జోరు

 West Bengal Election Results

తమ కుమార్తెకు న్యాయం కోసమే సమరం

ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన అమానుష ఘటన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆ బాధిత కుటుంబానికి అండగా నిలిచిన బీజేపీ, రత్న దేబ్‌నాథ్‌ను ఎన్నికల బరిలోకి దించింది. మహిళల భద్రత, తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై న్యాయం కోరడమే ప్రధాన అజెండాగా ఆమె ప్రచారంలో దూసుకుపోయారు.

హోరాహోరీ పోరు

  • రత్న దేబ్‌నాథ్ (BJP): తొలి రౌండ్లలో ఆధిక్యంలో ఉన్నారు.
  • తీర్థంకర్ ఘోష్ (TMC): గట్టి పోటీ ఇస్తూ రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
  • కలతాన్ దాస్‌గుప్తా (CPI-M): మూడో స్థానంలో ఉన్నారు.

పానిహతి నియోజకవర్గం 2011 నుండి తృణమూల్ కాంగ్రెస్ (TMC) కంచుకోటగా ఉంది. నిర్మల్ ఘోష్ ఇక్కడ వరుసగా గెలుస్తూ వచ్చారు. అయితే, ఈసారి రత్న దేబ్‌నాథ్ రాకతో ఇక్కడ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. తమ కుమార్తె కోసం పోరాడుతున్న ఒక తల్లికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు ప్రస్తుత ట్రెండ్స్ సూచిస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

సొంత గడ్డపై దీదీ వెనుకంజ.. బెంగాల్‌లో కమలం వికాసం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha