Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సొంత గడ్డపై దీదీ వెనుకంజ.. బెంగాల్‌లో కమలం వికాసం!

సొంత గడ్డపై దీదీ వెనుకంజ.. బెంగాల్‌లో కమలం వికాసం!

వార్త 1 month ago

West Bengal Election Results: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానిపూర్ నియోజకవర్గంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

గతంలో నందిగ్రామ్‌లో మమతను ఓడించిన బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి, ఈసారి ఆమె సొంత గడ్డపైనే సవాల్ విసిరి ఆధిక్యంలోకి దూసుకెళ్లారు.

Read Also : Election Results: బెంగాల్, అస్సాంలో బీజేపీ జోరు

 West Bengal Election Results

రాష్ట్రవ్యాప్తంగా కమల వికాసం.. మేజిక్ ఫిగర్ దాటిన బీజేపీ

బెంగాల్‌లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గానూ, ప్రస్తుతం వెలువడుతున్న ట్రెండ్స్ ప్రకారం బీజేపీ మేజిక్ ఫిగర్ (148) దాటి 160కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) 110-115 స్థానాల మధ్య ఊగిసలాడుతోంది. దీంతో 15 ఏళ్ల తర్వాత బెంగాల్‌లో అధికార మార్పిడి జరిగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

భవానిపూర్‌లో ఉత్కంఠ పోరు.. సెకండ్ రౌండ్‌లో సువెందు లీడ్!

భవానిపూర్ నియోజకవర్గంలో మొదటి రౌండ్ ముగిసేసరికి మమతా బెనర్జీ స్వల్ప ఆధిక్యంలో ఉన్నప్పటికీ, రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి పరిస్థితి తారుమారైంది.

  1. సువెందు అధికారి ఆధిక్యం: 1,558 ఓట్లు.
  2. మమతా బెనర్జీ: రెండో స్థానానికి పరిమితం.

తన మాజీ సహచరుడే తన సొంత నియోజకవర్గంలో గట్టి పోటీ ఇవ్వడం ఇప్పుడు బెంగాల్ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భవానిపూర్ ఫలితం బెంగాల్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడంలో అత్యంత కీలకంగా మారనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

అస్సాంలో మళ్ళీ 'హిమంత' హవా..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha