Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్టీసీ బస్సులో భారీ అగ్నిప్రమాదం

ఆర్టీసీ బస్సులో భారీ అగ్నిప్రమాదం

వార్త 3 weeks ago

Bengaluru Bus Fire Accident: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో శనివారం భారీ అగ్నిప్రమాదం తృటిలో తప్పింది. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) కి చెందిన ఒక లగ్జరీ బస్సు ప్రయాణికులతో రోడ్డుపై వెళ్తుండగా అకస్మాత్తుగా ఇంజిన్‌లో మంటలు చెలరేగి, బస్సు మొత్తం వేగంగా వ్యాపించాయి.

బెంగళూరులోని ప్రసిద్ధ జ్ఞాన భారతి మెట్రో స్టేషన్ (Gnanabharathi Metro Station) సమీపంలో శుక్రవారం (జూలై 3) ఈ భయానక సంఘటన చోటుచేసుకుంది. అయితే, డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది.

Read Also:Ketan Agarwal Case: కేతన్ అగర్వాల్ హత్య కేసు.. సియా, చేతన్‌లకు 14 రోజుల జుడీషియల్ కస్టడీ

ఇంజిన్ నుండి వ్యాపించిన మంటలు..

పోలీసులు మరియు రవాణా శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని పయ్యన్నూరు (Payyanur) నుంచి ప్రయాణికులతో బయలుదేరిన ఈ ఆర్టీసీ బస్సు బెంగళూరు నగరంలోకి ప్రవేశించింది. జ్ఞాన భారతి మెట్రో స్టేషన్ వద్దకు చేరుకోగానే బస్సు ఇంజిన్ క్యాబిన్ నుండి ఒక్కసారిగా పొగలు, మంటలు రావడం ప్రారంభమైంది. నిమిషాల వ్యవధిలోనే ఆ మంటలు బస్సు లోపలి భాగాలకు (క్యాబిన్) చొచ్చుకువచ్చాయి.

డ్రైవర్, కండక్టర్ అప్రమత్తత.. సేఫ్!

మంటలను గమనించిన బస్సు డ్రైవర్ క్షణాల్లో అప్రమత్తమయ్యాడు. వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి, కండక్టర్‌తో కలిసి సీట్లలో ఉన్న ప్రయాణికులను కిందకు దిగిపోవాలని గట్టిగా అరిచాడు. ఆ సమయంలో బస్సులో ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ఉండడంతో, వారు క్షణాల వ్యవధిలో సురక్షితంగా కిందకు దూకేశారు. బస్సు లోపల ఉన్నవారంతా సురక్షితంగా బయటపడిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయి. దట్టమైన పొగలు కమ్మేయడంతో మైసూర్ రోడ్డు మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది.

Bengaluru Bus Fire Accident: రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది..

ప్రమాదంపై స్థానికులు అందించిన సమాచారంతో బెంగళూరు అగ్నిమాపక సిబ్బంది (Fire Department) రెండు ఫైర్ ఇంజిన్లతో తక్షణమే ఘటనాస్థలికి చేరుకున్నారు. దాదాపు గంటకు పైగా శ్రమించి బస్సు మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ లేదా ఇంజిన్ ఓవర్ హీట్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రయాణికులు తక్కువగా ఉండడం, డ్రైవర్ సమయస్ఫూర్తి ప్రదర్శించడంతో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. జెట్ వేగంతో మంటలు వ్యాపించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Epaper: epaper.vaartha.com

35 రోజులుగా అంకం రాహుల్ మృతదేహం కోసం తల్లిదండ్రుల పోరాటం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha