Dailyhunt
ఆశాజనకంగా మిర్చి ధరలు!

ఆశాజనకంగా మిర్చి ధరలు!

వార్త 1 week ago

తేజారకం మిర్చి క్వింటా రూ.21,580

Telangana Chilli Prices తెలంగాణాలో మిర్చి ధరలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది మిర్చి రైతులకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అన్ని రకాల మిర్చి ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్ వ్యవసాయ మార్కెట్లలో తేజా రకం ఎండు మిర్చి క్వింటా రూ.21,000 రూ.21,580 వరకు ధర పలుకుతోంది. తాజాగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా మిర్చి క్వింటా రూ.21,000 వరకు, ఏసీ మిర్చి రూ.21,580 వరకు పలికింది. చైనా నుంచి ఆర్డర్లు పెరగడంతో అంతర్జాతీయ డిమాండ్ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.

Read Also: Madanapalle tomato price: టమాటా ధరకు రెక్కలు.. కిలో ఎంతో తెలుసా?

 There is huge demand for Teja chili in the Khammam market.

Telangana Chilli Prices: ఇక చపాట మిర్చి క్వింటా రూ.50వేలు

అలాగే టమాటా మిర్చి, ఎల్లో మిర్చి వంటి ప్రీమియం రకాలు కూడా రూ.40,000-50,000 వరకు ధర పలుకుతున్నాయి. ఈ సీజన్లో మిర్చి కొనుగోళ్లు మొదలైన జనవరి 1 నుంచి ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు 13లక్షల మిర్చి బస్తాలను విక్రయించేందుకు రైతులు తీసుకొచ్చారు. ఈ సీజన్ పూర్తయ్యే నాటికి మరో 3లక్షల బస్తాల వరకు రావొచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది 34లక్షలకు పైగా మిర్చి బస్తాలు ఖమ్మం మార్కెట్కు తరలివచ్చాయి.

అయితే గతేడాది మిర్చి ధర రూ.12,500 నుంచి 14వేల వరకు మాత్రమే పలికింది. కేవలం తేజా మిర్చి మాత్రమే కాకుండా, టమాటా మిర్చి, ఎల్లో మిర్చి ధరలు కూడా అందరినీ ఆశ్చర్యపరు స్తున్నాయి. ఇవి క్వింటాకు రూ.40,000 నుండి రూ.50,000 వరకు పలకడం విశేషం. పంట నాణ్యత బాగుండటం, విదేశీ మార్కెట్ అవసరాలు పెరగడంతో మిర్చి రైతులకు ఈ ఏడాది మార్కెట్ పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నా యి. అంతర్జాతీయ మార్కెట్లో మిర్చి ధరలకు ఫుల్ డిమాండ్ ఉండడంతోపాటు మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో మిర్చి సాగు తగ్గడం వల్ల తెలంగాణలో మిర్చికి ఫుల్ డిమాండ్ పెరిగింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ప్రముఖుల 'భద్రత' కుదింపు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha