Dailyhunt
ఆస్పత్రికి వచ్చిన యువతిపై ఆటో డ్రైవర్ అఘాయిత్యం

ఆస్పత్రికి వచ్చిన యువతిపై ఆటో డ్రైవర్ అఘాయిత్యం

వార్త 3 weeks ago

Vijayawada Crime: విజయవాడ నగరంలో మానవత్వాన్ని మంటగలిపే ఘటన వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న తన తండ్రిని చూసేందుకు వచ్చిన ఒక యువతిని ఆటో డ్రైవర్ లక్ష్యంగా చేసుకున్నాడు.

మాయమాటలతో నమ్మించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Read Also: Breaking news: Sangareddy Bus Accident: సంగారెడ్డి వద్ద రెండు బస్సులు ఢీ

Vijayawada Crime: జీజీహెచ్ (GGH) వద్ద మాయమాటలతో ట్రాప్

బాధితురాలు తన తండ్రి చికిత్స పొందుతున్న విజయవాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (GGH) వద్దకు వచ్చింది. ఆ సమయంలో నిందితుడైన ఆటో డ్రైవర్ ఆమెకు పరిచయమయ్యాడు. ఆమె అవసరాన్ని ఆసరాగా చేసుకుని, సాయం చేస్తానంటూ మాయమాటలు చెప్పి తన ఆటోలో ఎక్కించుకున్నాడు.

 Vijayawada GGH Auto Driver Rape Case

కృష్ణలంకకు తీసుకెళ్లి దారుణం

నిందితుడు బాధితురాలిని ఆటోలో కృష్ణలంక ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘోరం తర్వాత బాధితురాలు జరిగిన విషయాన్ని తన తల్లికి వివరించింది. కూతురికి జరిగిన అన్యాయంపై బాధితురాలి తల్లి వెంటనే పోలీసులను ఆశ్రయించింది.బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు నిందితుడైన ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు ఆస్పత్రి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

కరీంనగర్ కేంద్రంగా సైబర్ నెట్వర్క్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha