Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆస్తి ఇచ్చినా అంత్యక్రియలకు రాలేదు..

ఆస్తి ఇచ్చినా అంత్యక్రియలకు రాలేదు..

వార్త 2 months ago

Mahabubnagar news: కన్నతల్లిని కడసారి కూడా చూడ డానికి ఆ కొడుకు రాలేదు.. తల్లి పేరు మీద ఉన్న పొలాన్ని తన పేరు చేయించుకున్నాడు. అయినా అమ్మ మీద కనీసం జాలి కలగలేదు..

అమ్మ ఇక లేదు అన్న విషయాన్ని రక్తం పంచుకుని పుట్టిన తోబుట్టువులు చెప్పినా కడసారి చూపుకు కూడా నోచుకోలేదు.. ఇక చేసేదేమీ లేక కన్న బిడ్డలే అంత్యక్రియల తంతు చేసిన ఘటన మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ లో చోటు చేసుకున్నది. కొమ్ము చంద్రమ్మ, కొమ్ము జంగయ్య దంపతులు నాగర్ కర్నూల్ జిల్లా పోతిరెడ్డిపల్లి వాసులు, వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె నిమ్మల అన్నపూర్ణమ్మ, ఒక కుమారుడు కొమ్ము మల్లేష్, చిన్న కుమార్తె డి.వసంత ఉన్నారు. 14 ఏళ్ల కిందటే ఇంటి పెద్ద కొమ్ము జంగయ్య మరణించాడు. తదనంతరం చంద్రమ్మ తాను జీవితాంతం కష్ట పడి, ఆస్తిని పోగుచేసి తన సంతానానికి అందజేయాలని కోరుకున్నది. ఈ క్రమంలో తన పేరా ఉన్న 12 ఎకరాల పొలంలో బిడ్డల పేరు మీద ఒక్కో ఎకరా చొప్పున రిజిస్ట్రేషన్ చేసి, 9 ఎకరాల పొలాన్ని తన కుమారుడు కొమ్ము మల్లేష్ పేరు మీద చేసింది. ఇంత చేసిన కుమారుడు కోడలు నుంచి తన బాధలు తప్పలేదు. తనను వేధిస్తున్నారంటూ ఇప్పటికే తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు అయినట్లు సమాచారం.

Read also: Sangareddy Rains News:అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం.. తడిసిముద్దైన వరి ధాన్యం

 Mother funeral Bhootpur property dispute son

Mahabubnagar news: కూతుళ్లే దగ్గరుండి అంత్యక్రియలు

తనకుమారుడు పట్టించుకోక పోవడంతో గత కొంతకాలంగా భూత్పూర్ లో నివాసం ఉంటున్నది. కుమారుడు పట్టించుకోకపోవడంతో అన్ని తామై బిడ్డలే చూసుకుంటున్నారు. చేదోడు వాదోడుగా ఉంటూ అవసరమైనప్పుడల్లా వైద్య సేవలు కూడా అందిస్తూ వచ్చారు. తల్లి అనారోగ్యం పాలైన కూడా ఏ ఒక్క రోజు వచ్చి చూసిన పాపాన పోలేదని బిడ్డలు ఆరోపిస్తున్నారు. ఆస్తిని పొంది కూడా కనీసం తల్లి బాగోగులు చూడలేదని స్థానికులు చెబుతున్నారు. అంతిమయాత్రకు రాలే.. చంద్రమ్మ సోమవారం ఉదయం నాలుగు గంటలకు తనువు చాలించింది. విషయం తెలుసుకున్న కుమార్తెలు అంతిమ యాత్ర తంతును వారే కొనసాగించారు. పెద్ద కుమార్తె అన్నపూర్ణమ్మ భూత్పూర్ రెండో వార్డు కౌన్సిలర్ గా ఉన్నారు. ఆమెనే ముందు నడిచి కార్యక్రమం అంతా పూర్తి చేశారు. ఆస్తి తగాదాలతో కన్న తల్లిదండ్రులకు కొరివి పెట్టని కొడుకులను చూసాం కానీ ఆస్తిలో భాగం తీసుకొని కూడా కనీసం అంతిమయాత్ర కు కూడా రాలేదని, కన్నతల్లిని కడసారి చూడడానికి కూడా రాలేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని తాము ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

లారీలు రావు మిల్లర్లు కొనరు అని నిరసిస్తూ రోడ్డెక్కిన రైతన్నలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha