Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆస్తి వేలం పై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న బండ్ల గణేశ్

ఆస్తి వేలం పై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న బండ్ల గణేశ్

వార్త 3 weeks ago

Bandla Ganesh: తన కుటుంబ ఆస్తిని బ్యాంక్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా, అత్యంత అన్యాయంగా వేలం వేశారంటూ టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ సంచలన ఆరోపణలు చేశారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన స్థిరాస్తిని యూనియన్ బ్యాంక్ వేలం వేయడం చట్టబద్ధమేనంటూ తాజాగా హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఈ వివాదంపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్ చేస్తూ తన ఆవేదనను, తదుపరి కార్యాచరణను పంచుకున్నారు.

బ్యాంకు అధికారులు కొందరితో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని, మార్కెట్ ధర కంటే చాలా తక్కువ రేటుకే తన విలువైన ఆస్తిని విక్రయించేశారని బండ్ల గణేశ్ ఆరోపించారు. ఈ అన్యాయాన్ని ఎదిరిస్తూ 2022లోనే నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించాను. అప్పట్లో కింది కోర్టు అయిన డెట్ రికవరీ ట్రైబ్యునల్ (DRT) లో నాకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. కానీ, తాజాగా హైకోర్టులో మాకు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. అయినప్పటికీ నాకు భారత న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. నా హక్కుల కోసం, న్యాయం కోసం త్వరలోనే దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాను” అని ఆయన స్పష్టం చేశారు.

Read Also: Bandla Ganesh: బండ్ల గణేష్‌కు చుక్కెదురు.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

 Bandla Ganesh to approach Supreme Court over property auction.

Bandla Ganesh: అసలు కేసు వివరాలు ఇవే..

బండ్ల గణేశ్ కుటుంబం తీసుకున్న రుణాల వసూళ్ల ప్రక్రియలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూబ్లీహిల్స్‌లోని వారి ఆస్తిని వేలం ద్వారా విక్రయించింది. అయితే, ఆ వేలం ప్రక్రియ నిబంధనల ప్రకారం జరగలేదని, కాబట్టి దాన్ని రద్దు చేయాలని గతంలో డెట్ రికవరీ ట్రైబ్యునల్ (DRT) పేర్కొంది. అంతేకాకుండా, వేలం ద్వారా వచ్చిన సొమ్మును తిరిగి ఆస్తి యజమానులకే చెల్లించాలంటూ బ్యాంకును ఆదేశించింది. ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ యూనియన్ బ్యాంక్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. డీఆర్‌టీ (DRT) ఇచ్చిన పాత తీర్పును కొట్టేసింది. రుణాల వసూళ్ల కోసం బ్యాంక్ జరిపిన ఆస్తి వేలం చట్టబద్ధమేనంటూ తీర్పు వెలువరించింది. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ బండ్ల గణేశ్ ఇప్పుడు సుప్రంకోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు.

Epaper: epaper.vaartha.com

ప్రశ్నిస్తే చంపేస్తారా?.. జనసైనికులపై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha