Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆస్తికోసం తల్లిని, తమ్ముడిని కాల్చి చంపిన అన్న

ఆస్తికోసం తల్లిని, తమ్ముడిని కాల్చి చంపిన అన్న

వార్త 2 weeks ago

Uttar Pradesh Crime: ఆధునిక యుగంలో ప్రేమలు చల్లారిపోతున్నాయి. అత్మీయ అనుబంధాలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అనేకుల్లో స్వార్థం తారాస్థాయికి చేరుకుంటున్నది.

కుటుంబ అనుబంధాలు లేవు. డబ్బు కోసం, ఆస్తుల కోసం తోడ బుట్టినవారిని, కన్నవారిని సైతం హతమార్చేందుకు వెనుకాడడం లేదు. డబ్బే సర్వస్యం అనుకుంటున్నారు. డబ్బుతో సర్వసుఖాలను అనుభవించవచ్చని భావిస్తున్నారు. అందుకే ఆస్తుల కోసం కన్నవారిని చంపుతున్న సంఘటనలు తరచూ చోటుచేసుకోవడం విచారకరం. తాజాగా ఆస్తి కోసం కన్నతల్లిని, తమ్ముడిని హతమార్చి అన్న ఉదంతం వెలుగులోకి వచ్చింది.

Read Also: Eluru crime: నల్లగా ఉన్నాడని అనుమానంతో 11 ఏళ్ల బాలుడి హత్య!

 Elder brother kills mother and younger brother over property

Uttar Pradesh Crime: అసలు ఏం జరిగింది?

ఆదివారం ప్రపంచమంతా మాతృదినోత్స వం ఆనందంగా జరుపుకుంటున్న సమయంలో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ లోని బందా జిల్లాలో రాజ్ కిషోర్ గుప్తా అనే వ్యక్తి కుటుంబానికి చెందిన పూర్వీకుల ఆస్తిని తండ్రి ఇటీవల అమ్మాడు. దీంతో అతడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు. అయితే ఆదివారం తెల్లవారుజామున ఆ భూమి అమ్మకంపై తల్లి, తమ్ముడితో రాజ్ కిషోర్ గొడవపడ్డాడు.

తల్లి, తమ్ముడు అన్నకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుండగానే ఆగ్రహంతో ఊగిపోతున్న అతడు గన్తో వారిద్దరిపై కాల్పులు జరిపి, అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఇంటికి వచ్చి చూడగా, రక్తపు మడుగులో తల్లి, కుమారుడు పడి ఉన్నారు. పోలీసులు వారిని హుటాహుటిగా ఆసుపత్రికి తరలించగా, వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు రాజ్ కిషోర్ కోసం గాలిస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

పక్కా పథకం ప్రకారమే పనిమనిషిగా చేరి, ఆపై హత్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha