Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పక్కా పథకం ప్రకారమే పనిమనిషిగా చేరి, ఆపై హత్య

పక్కా పథకం ప్రకారమే పనిమనిషిగా చేరి, ఆపై హత్య

వార్త 3 months ago

Retired IPS wife murder: విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో ఇద్దరు అరెస్టు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. చివరికి ఇంట్లో పనిచేసే పనిమనుషులను కూడా నమ్మే పరిస్థితులు లేవు.

ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నట్లు నటించి, యజమానుల అభిమానాన్ని చూరగొన్నతర్వాత వారికి అందినకాడికి దోచుకెళ్లేందుకు ఎంతకైనా తెగిస్తారు. అవసరమైన ఇంటి యజమానులను హతమార్చేందుకు కూడా వెనుదీయరు. ఇటీవల హైదరాబాద్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యను ఇంటిపనిమనుషులే హతమార్చిన విషయం తెలిసిందే. చంచలనం సృష్టించిన సంఘటనలో నిందితుల గురించి విచారణలో విస్తూ పోయే విషయాలు వెల్లడి అవుతున్నాయి.

Read Also: Mahabubnagar Road Accident: ఐదుగురి ప్రాణాలు బలిగొన్న యువకుల బైక్ రేసింగ్ సరదా

 Sahu Gang Nepal

Retired IPS wife murder: ఢిల్లీ జైలు నుంచే పక్కా ప్రణాళిక

హైదరాబాద్ మాజీ ఔపీఎస్ భార్య హత్యకేసులో నిందితులు నేపాల్ కు చెందిన సాహు గ్యాంగ్ గా పోలీసులు గుర్తించారు. ముంబై, నేపాల్, పాట్న నుండి వేర్వేరు వ్యక్తులను అటాచ్ చేసి దోపిడీకి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. అంతేకాక దొంగలించిన బంగారాన్ని ముంబైల్ దాచినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పనిమనిషి కల్ప కోసం
పూణేలో పోలీసులు గాలిస్తున్నారు.

సంఘటన వివరాలు

జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లో విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ (60) హత్య నగరంలో సంచనలం సృష్టించింది. ఇంటి పనిమనిషి కల్పనతో సహా మరో ఇద్దరు వినయ్ రంజన్ రే ఇంట్లో లేని సమయంలో భార్య తనూజ ఒంటరిగా ఉండడం అవకాశంగా చేసుకుని, ఇంట్లోకి జొరబడి, ఆమెను తాళ్లతో కట్టి, నోట్లో గుడ్డలు కుక్కి, అందినకాడికి దోచుకుని, వెళ్లిపోయారు. దీంతో ఆమె ఊపిరి ఆడక,
ప్రాణాలొదిలింది. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తవేగంగా జరుపుతున్నారు. ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేయగా, ప్రధాన నిందింతురాలు కల్పన కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

సువేందు అధికారి పీఏ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha