Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నల్లగా ఉన్నాడని అనుమానంతో 11 ఏళ్ల బాలుడి హత్య!

నల్లగా ఉన్నాడని అనుమానంతో 11 ఏళ్ల బాలుడి హత్య!

వార్త 3 months ago

Eluru crime: నాయుడుగూడెంలో నివాసముంటున్న వినోద్ అనే వ్యక్తికి 11 ఏళ్ల కుమారుడు రిషిబాబు ఉన్నాడు. అయితే, తన కుమారుడు నల్లగా ఉన్నాడని, అతను తనకు పుట్టలేదనే అకారణమైన అనుమానంతో వినోద్ గత కొన్నేళ్లుగా భార్యను, కుమారుడిని చిత్రహింసలకు గురిచేస్తున్నాడు.

ఈ విషయంలో గతంలో పలుమార్లు పెద్దమనుషులు కౌన్సెలింగ్ ఇచ్చినా వినోద్ ప్రవర్తనలో మార్పు రాలేదు.

Read Also:Former IPS Wife Death Case: శ్వాస ఆడకనే మాజీ ఐపిఎస్ సతీమణి మృతి

 Naidugudem Boy Murder

అనుమానాస్పద మృతి

శనివారం ఉదయం రిషిబాబు ఇంటి బయట మంచంపై శవమై కనిపించాడు. బాలుడి శరీరంపై పలుచోట్ల గాయాలు ఉండటంతో, తండ్రి వినోద్‌యే అతడిని కొట్టి చంపి ఉంటాడని బంధువులు ఆరోపిస్తున్నారు. బాలుడి తాత (తల్లి తరపున) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కుమారుడిపై ఉన్న ద్వేషంతోనే వినోద్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Eluru crime: పోలీసుల దర్యాప్తు

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు వినోద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. “కుమారుడి రంగుపై ఉన్న అనుమానమే ఈ గొడవలకు మూలమని తెలుస్తోంది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత బాలుడి మరణానికి ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయి” అని పోలీసులు వెల్లడించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

సువేందు అధికారి పీఏ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha