Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆసుపత్రి నుంచి ఢిల్లీ బౌలర్ లుంగీ ఎంగిడి డిశ్చార్జ్

ఆసుపత్రి నుంచి ఢిల్లీ బౌలర్ లుంగీ ఎంగిడి డిశ్చార్జ్

వార్త 2 months ago

Lungi Ngidi Injury: పంజాబ్ కింగ్స్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఒక క్యాచ్‌ను పట్టుకునే క్రమంలో సౌతాఫ్రికా పేసర్ లుంగీ ఎంగిడి ప్రమాదకరంగా కింద పడ్డారు.

ఈ క్రమంలో ఆయన మెడ భాగంలో తీవ్రమైన ఒత్తిడి నెలకొనడంతో మైదానంలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.ఫిజియో తనిఖీ చేసినా స్పందన లేకపోవడంతో, వెంటనే అంబులెన్స్‌ను గ్రౌండ్‌లోకి రప్పించి ఆసుపత్రికి తరలించారు.ఎంగిడి పరిస్థితి చూసి ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ మరియు ఐపీఎల్ నిర్వాహకులు కొద్దిగంటల పాటు తీవ్ర ఉత్కంఠకు లోనయ్యారు.

Read Also:Pat Cummins: బౌలర్లు ఇక బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయండి.. పరుగుల వరదపై పాట్ కమిన్స్ సెటైర్లు

అదృష్టవశాత్తూ ఎంగిడికి తగిలిన గాయం ప్రాణాపాయం కాదని వైద్యులు తేల్చారు. ఢిల్లీ క్యాపిటల్స్ కో-ఓనర్ గ్రంధి కిరణ్ కుమార్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి చికిత్సను పర్యవేక్షించారు.ఒక్క రోజు నిశిత పరిశీలన తర్వాత వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు.

Lungi Ngidi Injury: మళ్ళీ మైదానంలోకి ఎప్పుడు?

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ, ఎంగిడి మళ్ళీ ఎప్పుడు మ్యాచ్‌లకు అందుబాటులోకి వస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.మెడ భాగంలో గాయం కావడంతో ఆయన కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది.ఢిల్లీ తర్వాతి మ్యాచ్‌లకు ఆయన స్థానంలో ఎవరిని బరిలోకి దింపుతారో చూడాలి. ఎంగిడి లాంటి కీలక బౌలర్ దూరం కావడం ఢిల్లీకి కొంత నష్టమే అయినా, ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడటమే పెద్ద గుడ్ న్యూస్ అని అభిమానులు భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

పాట్ కమిన్స్ కొత్త ఫేవరెట్ ప్లేయర్ ఎవరో తెలుసా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha