Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బౌలర్లు ఇక బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయండి.. పరుగుల వరదపై పాట్ కమిన్స్ సెటైర్లు

బౌలర్లు ఇక బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయండి.. పరుగుల వరదపై పాట్ కమిన్స్ సెటైర్లు

వార్త 2 months ago

Pat Cummins: ఐపీఎల్ 2026లో బ్యాటర్ల విధ్వంసం, రికార్డు స్థాయి పరుగుల వేటపై సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కెప్టెన్ పాట్ కమిన్స్ తనదైన శైలిలో స్పందించారు.

బౌలర్లు మనుగడ సాగించాలంటే బ్యాటింగ్ నేర్చుకోవాల్సిందేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read Also:SRH vs RR: రాజస్థాన్ రాయల్స్ ఓటమికి కారణం అదే: కెప్టెన్ రియాన్ పరాగ్

బ్యాటర్ల రాజ్యంలో బౌలర్ల కష్టాలు: కమిన్స్ రియాక్షన్

శనివారం జరిగిన ఐపీఎల్ డబుల్ హెడర్ మ్యాచ్‌లు క్రికెట్ చరిత్రలోనే రికార్డులను తిరగరాశాయి.

  1. DC vs PBKS: ఢిల్లీ నిర్దేశించిన 265 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ ఛేదించి చరిత్ర సృష్టించింది.
  2. SRH vs RR: రాజస్థాన్ చేసిన 228 పరుగులను సన్‌రైజర్స్ అలవోకగా ఛేదించి విజయం అందుకుంది.

ఈ పరుగుల వరదపై మ్యాచ్ అనంతరం పాట్ కమిన్స్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం టీ20ల్లో బ్యాటర్ల హవా నడుస్తోంది. బౌలర్లు నిలదొక్కుకోవాలంటే మేం కూడా బౌలింగ్ కంటే బ్యాటింగ్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాలేమో” అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. గాయం తరువాత రీ ఎంట్రీ ఇవ్వడంపై ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అవును నిజమే రీ ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. రీ ఎంట్రీ తరువాత తొలి మ్యాచ్ ఇదే. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలా ఆడతానో అని చిన్న సందేహం ఉండేది.

 Pat Cummins SRH vs RR 2026

Pat Cummins: బ్యాటింగ్ పై ఎక్కువగా ఫోకస్

కానీ నా ప్రిపరేషన్ చాలా బాగుంది. 10 ఏళ్ల క్రితం నేను కెరీర్ ప్రారంభించినప్పటితో పోలిస్తే ఇప్పుడు నాకున్న అనుభవంతో త్వరగానే టచ్‌లోని వచ్చాను అని పాట్ కమిన్స్ అన్నాడు.ఇక మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదు అవుతుండడంతో బౌలర్లు ఏం చేస్తారు? అనే ప్రశ్న ఎదురుకాగా.. తనకు తెలియదని, ఇక బౌలర్లు కూడా బ్యాటింగ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టాలేమో అని నవ్వుతూ చెప్పాడు. మ్యాచ్‌ల్లో స్కోర్లు ఎక్కువగా నమోదు అవుతున్నాయని, దీని వల్ల ప్రయోజనం కూడా ఉందన్నాడు.

ఒకటి లేదా రెండు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికి కూడా బౌలర్లు మళ్లీ పుంజుకుని మ్యాచ్ పై ప్రభావం చూపే అవకాశం ఉందన్నాడు. ప్రపుల్ హింగే విషయంలో ఇదే జరిగిందన్నాడు. టీ20 క్రికెట్ సాగుతున్న తీరు నిజంగా చాలా సరదాగా ఉందని చెప్పుకొచ్చాడు.నా గైర్హాజరీలో ఇషాన్ కిషన్ అద్భుతంగా జట్టును నడిపించాడు. యువ బౌలర్లతో కలిసి అసాధారణమైన ఫలితాలు రాబట్టాడు. అయితే మా దగ్గర హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు కూడా ఉన్నారు. మా డగౌట్ అంతా ప్రతిభావంతులైన బౌలర్లతో నిండి ఉంది. యువ ఆటగాళ్లు తమ ప్రణాళికలతో సిద్ధంగా ఉండటం గొప్ప విషయం అన్నాడు..

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

నిన్న ఒక్కరోజే 986 రన్స్..టోర్నీ చరిత్రలో రికార్డు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha