Telangana Auto Strike: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఆటో కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించారు.
ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేస్తూ, పలు కీలక హామీలను ప్రకటించారు.
Read Also :Telangana Auto Strike: తెలంగాణలో అర్ధరాత్రి నుంచి ఆటోలు,క్యాబ్‌లు బంద్

Telangana Auto Strike: ప్రభుత్వం ఇచ్చిన కీలక హామీలు
- ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు: ఆటో డ్రైవర్లు మరియు కార్మికుల భద్రత, సంక్షేమం కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
- ఆటో ఛార్జీల పెంపుపై కమిటీ: 2015 తర్వాత రాష్ట్రంలో ఆటో ఛార్జీలు పెంచలేదని, ప్రస్తుత పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ఛార్జీలను సమీక్షించి పెంచేందుకు ప్రత్యేక కమిటీని వేస్తామని హామీ ఇచ్చారు.
- ఎలక్ట్రిక్ ఆటోలకు ప్రోత్సాహం: పాత డీజిల్, పెట్రోల్ ఆటోలను స్క్రాప్ చేసి, కొత్తగా ఎలక్ట్రిక్ ఆటోలు (EVs) కొనుగోలు చేసే కార్మికులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం మరియు రాయితి అందిస్తామన్నారు.
- రెట్రోఫిట్‌మెంట్ పథకం: పాత డీజిల్ మరియు పెట్రోల్ ఆటోలను ఈవి (EV)లుగా మార్చుకునేందుకు (Retrofitment) వీలుగా కొత్త పథకాన్ని త్వరలోనే తీసుకువస్తామని ప్రకటించారు.
- గ్రామీణ ఆటో డ్రైవర్ల సమస్యలు: పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లో సర్వీసులు నడిపే ఆటో కార్మికుల సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని తగిన పరిష్కారాలు చూపుతుందని స్పష్టం చేశారు.
కార్మికులు సమ్మె నిర్ణయాన్ని విరమించుకుని, ప్రభుత్వంతో చర్చలకు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

