Dailyhunt
ఆయనకు 40..నాకు 19..భర్తతో జీవించలేను..హైకోర్టు తీర్పు ఏమిటి?

ఆయనకు 40..నాకు 19..భర్తతో జీవించలేను..హైకోర్టు తీర్పు ఏమిటి?

వార్త 3 weeks ago

ధ్యప్రదేశ్​ ఉన్నత న్యాయస్థానంలో ఒక అద్భుతమైన, ఆలోచింపజేసే సన్నివేశం ఆవిష్కృతమైంది. ఒక వైపు భర్త, మరో వైపు ప్రేమికుడు, మధ్యలో తల్లిదండ్రులు… అందరి చూపులు ఒకే వ్యక్తిపై నిలిచాయి - 19 ఏళ్ల యువతి.

ఆమె ఒక్క మాటతోనే తన జీవితానికి దిశను నిర్ణయించుకుంది. ఆయనకు 40 ఏళ్లు, నాకు 19. భార్యాభర్తలుగా ఎలా కలిసుండమంటారు? నేను మేజర్​ను… నా ఇష్టానుసారం జీవించే హక్కు నాకుంది. 40 ఏళ్ల భర్తతో కానీ, తల్లిదండ్రులతో కానీ ఉండనంటూ ఆమె కుండ బద్దలు కొట్టింది. న్యాయస్థానం తన అభిప్రాయానికే మద్దతు తెలిపింది.

Read Also: Operation Kagar: నక్సలైట్ల ఏరివేతపై ముగిసిన ఆపరేషన్ కగార్

 Madhya Pradesh

Madhya Pradesh: ఇష్టమే ముఖ్యమన్న ఉన్నత న్యాయస్థానం

తన భార్యను మరో వ్యక్తి అక్రమంగా నిర్బంధించాడని ఆరోపిస్తూ, అవదేశ్​ అనే వ్యక్తి మధ్యప్రదేశ్‌ హైకోర్టు గ్వాలియర్‌ బెంచ్ ముందు కేసు హెబియస్ కార్పస్ పిటిషన్‌ దాఖలు చేసాడు. పోలీసుల ద్వారా యువతిని గుర్తించి కోర్టు ముందు హాజరుపరిచారు. కానీ విచారణలో కీలక మలుపు తిరిగింది. కోర్టు అడిగిన ప్రశ్నలకు యువతి స్పష్టంగా, భయం లేకుండా సమాధానాలు ఇచ్చింది. తనను ఎవరూ నిర్బంధించలేదని, స్వచ్ఛందంగా తనకు నచ్చిన అనుజ్​ అనే వ్యక్తితో జీవిస్తున్నానని తెలిపింది. ఈ నేపథ్యంలో, యుక్తవయస్కురాలైన యువతికి తన జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది కాబట్టి, తన స్వేచ్ఛను కాపాడటం చట్టం బాధ్యత అని కోర్టు స్పష్టం చేసింది. తన వైవాహిక జీవితం గురించి చెబుతూ, ఆ తనకి 19 ఏళ్లనీ, భర్త 40 ఏళ్ల వాడనీ, 21 ఏళ్ల వయసు తేడా కారణంగా తమ మధ్య సఖ్యత కుదరలేదని వివరించింది. తమ వివాహంలో బంధం కంటే విభేదాలే ఎక్కువగా ఉన్నాయని, తనకు అన్యాయం జరిగిందని కన్నీళ్లతో వాపోయినప్పుడు న్యాయస్థానంలో భావోద్వేగాలు ముప్పిరిగొన్నాయి. ఈ సమయంలో ప్రియుడు కూడా కోర్టు ముందు హాజరై, ఆ యువతంటే తనకు చాలా ఇష్టమంటూ, ఆమెను జీవితాంతం చాలా బాగా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. ఈ దశలో కేసు ఒక కుటుంబ వివాద పరిధి దాటి వ్యక్తిగత స్వేచ్ఛపై చర్చగా మారింది

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

మిస్ ఇండియా ఎర్త్ 2019 సయాలీ సుర్వే కిడ్నాప్?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha