Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అభిమాని కోసం రంగంలోకి దిగిన ప్రీతి జింటా

అభిమాని కోసం రంగంలోకి దిగిన ప్రీతి జింటా

వార్త 2 weeks ago

Punjab Kings IPL 2026: గత నెల ఏప్రిల్ 19న న్యూ చండీగఢ్‌లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది.

పంజాబ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య కొట్టిన సిక్సర్ నేరుగా స్టాండ్స్‌లో కూర్చున్న 62 ఏళ్ల వృద్ధుడు కృష్ణన్ చంద్ ముఖానికి తగిలింది. దీంతో ఆయనకు తీవ్ర రక్తస్రావం కాగా, వెంటనే సిబ్బంది చికిత్స నిమిత్తం తరలించారు.

Read Also: IPL : నరైన్ సెన్సేషనల్ రికార్డ్

Punjab Kings IPL 2026: పరామర్శించిన ప్రీతి జింటా & ప్రియాన్ష్

ఈ విషయం తెలుసుకున్న ఫ్రాంచైజీ సహ యజమాని ప్రీతి జింటా, ఆటగాడు ప్రియాన్ష్ ఆర్య వెంటనే స్పందించారు. కృష్ణన్ చంద్‌కు వీడియో కాల్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తన షాట్ వల్ల గాయపడినందుకు ప్రియాన్ష్ విచారం వ్యక్తం చేయగా, ప్రీతి జింటా ఆయనను ఓదార్చారు.

ధర్మశాల మ్యాచ్‌కు స్పెషల్ ఆహ్వానం

కేవలం పరామర్శించడమే కాకుండా, కృష్ణన్ చంద్‌ను ధర్మశాలలో జరగబోయే పంజాబ్ కింగ్స్ తదుపరి మ్యాచ్‌కు పంజాబ్ టీమ్ వ్యక్తిగతంగా ఆహ్వానించింది. వచ్చేసారి స్టేడియానికి వచ్చినప్పుడు భయం లేకుండా మ్యాచ్ చూసేందుకు తాను స్వయంగా ఒక హెల్మెట్ బహుకరిస్తానని ప్రీతి జింటా ఆయనకు మాటిచ్చారు. పంజాబ్ కింగ్స్ చూపిన ఈ మానవత్వానికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

కార్తీక్ శర్మ విశ్వరూపం.. ధోనీలాగే "గన్ సెలబ్రేషన్"

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha