Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కార్తీక్ శర్మ విశ్వరూపం.. ధోనీలాగే "గన్ సెలబ్రేషన్"

కార్తీక్ శర్మ విశ్వరూపం.. ధోనీలాగే "గన్ సెలబ్రేషన్"

వార్త 2 weeks ago

Karthik Sharma: ముంబై ఇండియన్స్‌పై కార్తీక్ శర్మ చేసిన ఈ ప్రదర్శన కేవలం చెన్నై సూపర్ కింగ్స్‌కు విజయాన్ని మాత్రమే కాదు, విమర్శకులకు గట్టి సమాధానాన్ని కూడా ఇచ్చింది.

ముఖ్యంగా ధోనీ ‘గన్ సెలబ్రేషన్’ను గుర్తు చేస్తూ అతను చేసిన హంగామా ఇప్పుడు నెట్టింట మామూలుగా వైరల్ అవ్వడం లేదు.

Read Also:Vinesh Phogat: నాకేదైనా జరిగితే వాళ్లే బాధ్యులు: వినేశ్ ఫోగాట్

ఐపీఎల్ 2026 మినీ వేలంలో కార్తీక్ శర్మ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా రూ. 14.2 కోట్లు ఖర్చు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే సీజన్ మొదటి సగంలో అతను ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. కానీ ముంబై ఇండియన్స్‌పై ఆడిన ఈ ఇన్నింగ్స్‌తో ఆ ట్రోల్స్ అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టాడు.

Karthik Sharma: గైక్వాడ్ తో కలిసి చిరస్మరణీయ భాగస్వామ్యం

160 పరుగుల ఛేదనలో కెప్టెన్ రుతురాజ్ గాయక్వాడ్‌తో కలిసి కార్తీక్ శర్మ 98 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రుతురాజ్ (67) ఒకవైపు క్లాస్ ఇన్నింగ్స్ ఆడితే, కార్తీక్ (54) తన హిట్టింగ్‌తో ముంబై బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. చివరి వరకు క్రీజ్‌లో నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చి “ఫినిషర్” పాత్రకు న్యాయం చేశాడు.

 Karthik Sharma, Dhoni

ధోనీ స్టైల్ సెలబ్రేషన్

ఈ మ్యాచ్‌లో హైలైట్ ఏంటంటే.. కార్తీక్ శర్మ తన హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే బ్యాట్‌ను గన్ లాగా చూపిస్తూ “గన్ సెలబ్రేషన్” చేశాడు. ఇది గతంలో ఎంఎస్ ధోనీ శ్రీలంకపై చారిత్రాత్మక 183 పరుగులు చేసినప్పుడు చేసిన సెలబ్రేషన్. ఈ సీజన్‌లో ధోనీ మైదానంలో కనిపించకపోవడంతో ఆ లోటును కార్తీక్ తన ఆటతో, తీర్చాడని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

“ఇది నా తొలి ఐపీఎల్ అర్ధశతకం. మ్యాచ్ చివరి వరకు ఉండి జట్టును గెలిపించడమే నా లక్ష్యం. రుతురాజ్ అన్న నాకు చాలా సపోర్ట్ ఇచ్చాడు, సహజంగా ఆడమని సూచించాడు” అని కార్తీక్ మ్యాచ్ అనంతరం భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

నరైన్ సెన్సేషనల్ రికార్డ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha