Nellore Dowry Harassment | నెల్లూరు క్రైం , జూన్ 16, ప్రభాతవార్త : అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడుతూ భార్యపై ఇటుకతో దాడి చేసిన ఘటన నెల్లూరు రూరల్ మండలంలోని మదరాజగూడూరు గ్రామంలో చోటుచేసుకుంది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక దళితవాడకు చెందిన పాలిపి మానసకు పాలిపి ప్రశాంత్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహం అనంతరం భర్త ప్రశాంత్ అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేస్తూ మానసను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అలాగే అత్త పాలిపి వరలక్ష్మి, మామ పాలిపి సీనయ్య కూడా కట్నం డిమాండ్లకు మద్దతు ఇస్తూ వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read Also: Kalyandurg News: అభివృద్దే కూటమి ప్రభుత్వం లక్ష్యం!
ఇంతకుముందు తనపై జరుగుతున్న వేధింపుల విషయమై మానస నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినందుకు కక్ష పెంచుకున్న ప్రశాంత్, ఈ నెల సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఆమెపై ఇటుకతో దాడి చేశాడు. ఈ దాడిలో మానస తల కుడి భాగంలో రక్తస్రావ గాయం కాగా, ఎడమ చేతికి వాపు, గీతల గాయాలు అయ్యాయి.
Nellore Dowry Harassment
అనంతరం భర్త ఇద్దరు పిల్లలను తన వద్దే ఉంచుకుని మానసను ఇంటి నుంచి వెళ్లగొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. గాయపడిన మానసను ఆమె తల్లి, బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందించారు.బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

