Dailyhunt
అద్దంకిలో RMP డాక్టర్ దారుణ హత్య: పక్కా ప్లాన్‌తో ఇంట్లోకి చొరబడి..

అద్దంకిలో RMP డాక్టర్ దారుణ హత్య: పక్కా ప్లాన్‌తో ఇంట్లోకి చొరబడి..

వార్త 1 week ago

Addanki Crime: ప్రకాశం జిల్లా అద్దంకి మండల పరిధిలోని ధర్మవరం గ్రామంలో శనివారం అర్థరాత్రి అత్యంత కిరాతకమైన ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో ఆర్‌ఎంపిగా ప్రాక్టీస్ చేస్తున్న మేడగం కోటిరెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు ఆయన భార్య కళ్లముందే ప్రాణాలు తీశారు.

Read Also:Cyber Crime: ఒంటరి వ్యక్తులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్ల కొత్త మోసం

అర్ధరాత్రి వేళ పక్కా స్కెచ్

దుండగులు పక్కా ప్రణాళికతో ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అర్థరాత్రి సమయంలో కోటిరెడ్డి ఇంటి తలుపు తట్టిన నిందితులు.. తమకు ఆరోగ్యం బాగాలేదని, అత్యవసరంగా వైద్యం చేయాలని కోరారు. తలుపు తీయగానే లోపలికి చొరబడిన దుండగులు ఒక్కసారిగా దంపతులపై కారం చల్లారు. అనంతరం కోటిరెడ్డి భార్యను తాళ్లతో కట్టేసి, ఆమె అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కారు. ఆ తర్వాత ఆమె కళ్లముందే కోటిరెడ్డిపై కర్రలు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు.ఈ పరిణామంతో కోటిరెడ్డి భార్య స్పృహ కోల్పోయింది. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

 Addanki RMP Doctor Murder

Addanki Crime: వివాహేతర సంబంధం కోణంలో విచారణ?

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ హత్య వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకున్న అద్దంకి పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు గ్రామాల్లో అక్కడక్కడ ఉన్న సిసి కెమెరాల విజువల్స్‌ను పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని దర్శి డిఎస్‌పి బాలమురళీకృష్ణ తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

స్కూటీని ఢీకొన్న లారీ.. ముగ్గురు దుర్మరణం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha