Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్కూటీని ఢీకొన్న లారీ.. ముగ్గురు దుర్మరణం!

స్కూటీని ఢీకొన్న లారీ.. ముగ్గురు దుర్మరణం!

వార్త 2 months ago

Vikarabad Crime: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

వేగంగా దూసుకొచ్చిన లారీ స్కూటీని ఢీకొనడంతో దంపతులతో పాటు వారి కుమార్తె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Read Also:Telangana Inter Results 2026: ఇంటర్ ఫలితాలు.. నలుగురు విద్యార్థుల ఆత్మహత్య

వివరాల్లోకి వెళితే..

జహీరాబాద్‌కు చెందిన కవిరాజ్ (40), పావని (35) దంపతులు తమ కుమార్తె కీర్తన (11), కుమారుడు కార్తీక్ (13)తో కలిసి ఆదివారం రుక్మాపూర్‌కు వెళ్లారు. వచ్చే నెల మే 1న పావని సోదరుడి వివాహం జరగాల్సి ఉండటంతో, వేడుక ఏర్పాట్ల కోసం వీరు అక్కడికి వెళ్లారు. సాయంత్రం పనులు ముగించుకుని తిరిగి స్కూటీపై జహీరాబాద్‌కు బయలుదేరారు.

 Road Accident Peddemul

Vikarabad Crime: తట్టెపల్లి గ్రామ శివారులో మృత్యువు

వీరి ప్రయాణం తట్టెపల్లి గ్రామ శివారులోకి రాగానే, ఎదురుగా అతివేగంగా వచ్చిన లారీ స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి కవిరాజ్, పావని, కీర్తన తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు కార్తీక్ అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బాలుడిని చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మహమ్మద్ షరీఫ్‌పై కేసు నమోదు చేసి, లారీని స్వాధీనం చేసుకున్నట్లు పెద్దేముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

బెట్టింగ్లు, జూదంపై కఠిన చర్యలు: డిజిపి హరీష్ కుమార్ గుప్తా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha