Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త మోసాలకు ఓవైపు ఒంటరి వ్యక్తులు నిలువునా మోసపోతుండగా మరోవైపు ఈ తరహా కేసుల విచారణ పోలీసులకు సవాల్ గా మారుతు న్నాయి.
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కొత్త సైబర్ మోసాల వల్ల వేలాది మంది కోట్లాది రూపాయల నగదును పోగొట్టుకుంటుండగా ఇందులో కొందరు పరువు పోతుందనే కారణంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. ఈ తరహా నేరాలపై అందరు అప్రమత్తంగా వుండాలని సైబర్ క్రైం పోలీసులు కోరుతున్నారు. ఎలాంటి వ్యక్తులు లేదా యాప్పై అనుమానం వున్నా వెంటనే 1930 లేదా సమీప పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని వారు కోరుతున్నారు.
Read Also: Vikarabad Crime: స్కూటీని ఢీకొన్న లారీ.. ముగ్గురు దుర్మరణం!

Cyber Crime: ఒంటరి తనాన్ని ఆసరాగా చేసుకుంటున్న వైనం
మారిన పరిస్థితుల కారణంగా దేశంలో కోట్లాది మంది ఒంటరి జీవితం గడుపుతుండడం తెలిసిందే. ఇందులో పురుషులతో పాటు మహిళలు వు బడగా వీరిలో వివాహం అయిన వారు కాని వారు, వివాహ బంధం విచ్చినమైన వారు. మోసపోయిన వారు ఇలా అనేకరకాల వారు వుండం విది తమే. వీరిలో చాలా మంది కుటుంబ సభ్యులతో వుంటుండగా మరికొందరు కుటుంబాలతో వుండలేక హాస్టళ్లలో లేదా మరోచోట వుంటున్నారు. ఆ ధునిక జీవనశైలిలో ఇలా ఒంటరిగా వున్న వారు సంపాదనపరంగా బాగానే వున్నా తాము ఏకాకులమన్న బాధ మాత్రం వారిని నిత్యం వెంటాడుతూనే వుంటుంది. సరిగ్గా ఇలాంటి వారిని వెతికి తెలుకుంటునారు.
వాట్సాప్ మెసేజ్‌ల నుంచి వీడియో కాల్స్ వరకు
ఒంటరి వారి కోసం స్పెషల్ అంటూ పోస్టు లు పెడుతూ మీ కష్టాలను తీరుస్తాం.. కన్నీళ్లను తుడు స్తాం… ఆపదలో వుంటే ఆదుకుంటాం.. అంటూ పోస్టులు పెడుతున్నారు. మీకు ఇష్టమైతే మాతో మాటలు కలపండి అంటూ మొదట వాట్సాప్ మెసేజ్తో మాటలు కలుపుతారు. ఆ తరువాత వాటింగ్ కు దిగి ఆనక నేరుగా ఫోన్లో సం భాషణలు చేస్తూ తమతో నిత్యం మాట్లాడాలనుకుంటూ తాము వంపే యాప్లను ఇస్టాల్ చేసుకోవాలని కోరుతున్నారు. ఇక్కడి నుంచి సైబర్ నేరగాళ్ల మోసాలు మొదలవుతాయి. పురుషులయితే మహిళలు, మహిళలయితే పురుషులు మాటలు కలుపుతారు. ఒంటరి వయోధిక పురుషులు లేదా మధ్య వయస్సు వారు మహిళలు లేదా పురుషులతోనూ ఎదుటివారికి ఇష్టమైన రీతిలో మాటలు కలుపుతారు.
హనీ ట్రాప్ తరహాలో బెదిరింపులు.. వసూళ్లు
అనక వీరిచేత కూడా యాప్లను ఇస్టాల్ చేయించి ఎదుటివారి ఫోన్లలో వున్న సమాచారం అంతా లాగేసుకుంటారు. దీని తరువాత సైబర్ నేరగాళ్లు తమతో ఫోన్లో మాట్లాడే వారిని నగ్నంగా లేదా అర్ధనగ్నంగా వీడియో కాల్స్తో మాట్లాడాలని కోరుతారు. ఇందులో ఎవరైనా టెంప్ట్ అయి. నేరగాళ్లు చెప్పినట్టు చేసే అంతే సంగతులు, ఈ ఫొటో లను మరింత మార్చింగ్ చేసి వారి ఫోన్ కాల్ లిస్టులో వున్న వారికి వీటిని సంపుతామని బెదిరిస్తూ అందినంత వసూలు చేస్తున్నారు. నగ్నంగా మాట్లాడేందుకు ఇష్టప డని వారికి అశ్లీల వీడియోలు పంపుతూ వీటిని వీడియో రికార్డింగ్ చేసి ఆ తరువాత వారిని బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక రకంగా హనీ ట్రాప్ తరహాలో సాగే ఈ సైబర్ నేరం గురించి బాధితులు తెలుసుకునే లోపు బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. కొన్ని ఘటనల్లో వాధితులు ఇళ్లు ఆస్తులు అమ్ముకున్న ఉదంతాలు వున్నట్లు ఫైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు.
పోలీసుల సూచన: అప్రమత్తతే రక్షణ
ఇదిలా ఉండగా ఒంటరి వారికి సహాయంగా వుంటామని చెబుతూ సోషల్ మీడియాలో వచ్చే యాస్ల జోలికి వెళ్లవద్దని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. ఈ తరహా యాప్ లన్నీ గోల్మాల్కు కేరాఫ్ వున్నాయని సైబర్ క్రైం పోలీసులు అంటున్నారు, ఈ తరహా యాప్లను క్లిక్ చేయవద్దని, ఒకవేళ ఫోన్లు లేదా మెసే జీల ద్వారా ఎవరైనా బలవంతం చేస్తే వెంటనే 1930 లేదా సమీప పోలీసు స్టేషన్లకు ఫిర్యాదు చేయాలని వారు సూచించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

