Dailyhunt
అధికారం పోతే పార్టీ క్లోజ్.. మమతకు తప్పని గండం!

అధికారం పోతే పార్టీ క్లోజ్.. మమతకు తప్పని గండం!

వార్త 5 days ago

West Bengal Elections: పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు ఒక విలక్షణమైన శైలి ఉంది. ఇక్కడ ప్రజలు ఒక పార్టీకి పట్టం కడితే దశాబ్దాల పాటు తిరుగులేని అధికారాన్ని ఇస్తారు.

కానీ, ఒక్కసారి మార్పు కోరుకుని ఆ పార్టీని గద్దె దించితే.. మళ్ళీ ఆ పార్టీ కోలుకోవడం ఇంచుమించు అసాధ్యమని చరిత్ర చెబుతోంది. నేడు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తుండటంతో, తృణమూల్ కాంగ్రెస్ (TMC) పరిస్థితి కూడా కాంగ్రెస్, సీపీఎంల లాగే మారుతుందా? అన్న చర్చ మొదలైంది.

Read Also : Election Results: బెంగాల్, అస్సాంలో బీజేపీ జోరు

 West Bengal Elections

చరిత్ర పునరావృతమవుతోందా?

బెంగాల్ రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే మూడు ప్రధాన ఘట్టాలు కనిపిస్తాయి:

1. కాంగ్రెస్ యుగం (1947 – 1977)

స్వాతంత్ర్యం తర్వాత మూడు దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యం చలాయించిన కాంగ్రెస్, 1977లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ పుంజుకోలేకపోయింది. నేడు బెంగాల్‌లో ఆ పార్టీ ఉనికి నామమాత్రమే.

2. కమ్యూనిస్టుల కోట (1977 – 2011)

వరుసగా 34 ఏళ్ల పాటు (7 పర్యాయాలు) రాష్ట్రాన్ని పాలించి ప్రపంచ రికార్డు సృష్టించిన వామపక్షాలు, 2011లో మమతా బెనర్జీ చేతిలో ఓడిపోయాక అడ్రస్ లేకుండా పోయాయి. కేడర్ మొత్తం చెల్లాచెదురై ప్రస్తుతం ఉనికి కోసం పోరాడుతున్నాయి.

3. తృణమూల్ హవా (2011 – 2026)

‘పరివర్తన్’ నినాదంతో కమ్యూనిస్టులను గద్దె దించిన మమతా బెనర్జీ వరుసగా 15 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలారు. అయితే, నేటి ఫలితాల్లో బీజేపీ 160కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతో దీదీ సామ్రాజ్యానికి బీటలు వారినట్లు కనిపిస్తోంది.

    ఓటమంటే కేడర్ విచ్ఛిన్నమేనా?

    బెంగాల్ రాజకీయాల్లో ఓటమనేది కేవలం సీట్లు కోల్పోవడం మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో కేడర్ మొత్తం విచ్ఛిన్నం కావడం. గతంలో కాంగ్రెస్, సీపీఎంల విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ మొత్తం మమతా బెనర్జీ ఇమేజ్ మీదనే ఆధారపడి నడుస్తోంది. సరైన ద్వితీయ శ్రేణి నాయకత్వం లేకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్. ఒకవేళ అధికారం కోల్పోతే, తన పార్టీని, కార్యకర్తలను కాపాడుకోవడం మమతకు అతిపెద్ద సవాలుగా మారనుంది.

    Read Also hindi news: hindi.vaartha.com

    Epaper : epaper.vaartha.com

    Read Also :

    ఆర్జీ కర్ బాధితురాలి తల్లి రత్న దేబ్‌నాథ్ ముందంజ!

    Dailyhunt
    Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha