Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీ రద్దు.. ఫార్మా సిటీ పునరుద్ధరణ!

అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీ రద్దు.. ఫార్మా సిటీ పునరుద్ధరణ!

వార్త 2 days ago

Harish Rao on Future City: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చిన ఫ్యూచర్ సిటీ' (Future City) ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే రేవంత్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్యూచర్ సిటీని పూర్తిగా రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఒరిజినల్ ‘ఫార్మా సిటీ’ (Pharma City) ప్రాజెక్టును మళ్లీ యథాతథంగా పునరుద్ధరిస్తామని (Restore) ప్రకటించారు.

Read Also :TG First Glass Bridge: లవ్ సింబల్ ఆకారంలో తొలి గ్లాస్‌ బ్రిడ్జి.. ఎక్కడో తెలుసా!

 Telangana Pharma City revival

కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీ విషయంలో డబుల్ గేమ్ ఆడుతోందని హరీశ్‌రావు తీవ్రంగా విమర్శించారు. “ఫార్మా సిటీ ప్రాజెక్టును కొనసాగిస్తామని ఓ వైపు న్యాయస్థానానికి (కోర్టుకు) అఫిడవిట్ ఇస్తూ.. మరోవైపు బయట మాత్రం జిమ్మిక్కులు చేస్తూ ప్రజలను, రైతులను మోసం చేస్తున్నారు. అసలు కేంద్ర పర్యావరణ శాఖ అన్ని రకాల అనుమతులు ఇచ్చింది కేవలం ‘ఫార్మా సిటీ’కి మాత్రమేననే విషయాన్ని ప్రభుత్వం విస్మరిస్తోంది” అని హరీశ్‌రావు మండిపడ్డారు.

Harish Rao on Future City: ల్యాండ్ యూజ్ మారిస్తే భూములు వెనక్కి ఇవ్వాలి: హరీశ్‌రావు

భూసేకరణ నిబంధనలను గుర్తు చేస్తూ హరీశ్‌రావు కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీశారు. చట్టప్రకారం ల్యాండ్ యూజ్ (భూమి వినియోగం) మార్చడం లేదా ప్రాజెక్ట్‌లో డీవియేషన్ ఉంటే.. సేకరించిన రైతుల భూములను తిరిగి సదరు రైతులకే ఇచ్చేయాలని చట్టంలో స్పష్టంగా ఉందన్నారు.

ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన హరీశ్‌రావు.. రేవంత్ సర్కార్ ఫ్యూచర్ సిటీ పేరుతో అక్కడ పక్కాగా ‘రియల్ ఎస్టేట్ వ్యాపారం’ చేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి కల్పించాలనే ఉద్దేశాన్ని పక్కనబెట్టారని విమర్శించారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఫ్యూచర్ సిటీని రద్దు చేసి, పరిశ్రమల కోసం ఉద్దేశించిన ఒరిజినల్ ఫార్మా సిటీ ప్రాజెక్టును మళ్లీ తెరపైకి తెస్తామని, తద్వారా స్థానిక రైతులకు న్యాయం చేస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

బిజెపి, బిఆర్ఎస్ అవగాహనతోనే రేవంత్ పై విమర్శలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha