Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లవ్ సింబల్ ఆకారంలో తొలి గ్లాస్‌ బ్రిడ్జి.. ఎక్కడో తెలుసా!

లవ్ సింబల్ ఆకారంలో తొలి గ్లాస్‌ బ్రిడ్జి.. ఎక్కడో తెలుసా!

వార్త 2 days ago

TG First Glass Bridge: తెలంగాణ పర్యాటక రంగంలో సరికొత్తగా ముందుకెళ్తుంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో శరవేగంగా రూపుదిద్దుకుంటోంది.

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కాకతీయుల కాలం నాటి ఎల్లమ్మ చెరువులో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ వంతెన పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు సిద్ధమవుతోంది.

ఈ సరికొత్త పర్యాటక ఆకర్షణను అంతర్జాతీయ ప్రమాణాలతో, మొత్తం రూ. 4.22 కోట్ల భారీ వ్యయంతో 5 అడుగుల వెడల్పు, 150 మీటర్ల పొడవుతో ఈ గ్లాస్ బ్రిడ్జిని లవ్ సింబల్ ఆకారం లో అద్భుతంగా డిజైన్ చేస్తున్నారు. తెలంగాణలోనే ఏర్పాటవుతున్న తొలి గాజు వంతెన ఇదే కావడంతో.. పనులు ఇంకా పూర్తి కాకముందే స్థానికులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు చూడటానికి ప్రతిరోజూ ఇక్కడికి భారీగా తరలివస్తున్నారు.

Read Also : TGRTC Wages Update: ఆర్టీసీ కార్మికులకు సీఎం గుడ్‌న్యూస్..పెరిగిన వేతనాలు!

 The first glass bridge in the shape of a love symbol.. Do you know where it is?

TG First Glass Bridge: త్వరలోనే ప్రారంభం!

ఎల్లమ్మ చెరువు పరిసరాలను కేవలం గ్లాస్ బ్రిడ్జికే పరిమితం చేయకుండా, సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే ఒక పూర్తి స్థాయి వినోద కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా అక్కడ గార్డెన్స్, గ్రీనరీ, ఫిట్‌నెస్ ప్రియుల కోసం వాకింగ్ ట్రాక్, అద్భుతమైన లైటింగ్ సిస్టమ్, బతుకమ్మ ఘాట్, యువతను ఆకట్టుకునేలా ప్రత్యేక ఫోటో సెల్ఫీ పాయింట్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ గాజు వంతెన నిర్మాణం చివరి దశకు చేరుకుందని మున్సిపల్ అధికారులు వెల్లడించారు. సందర్శకుల రక్షణ దృష్ట్యా ఈ గ్లాస్ బ్రిడ్జికి సంబంధించిన సాంకేతిక, భద్రతా ప్రమాణాల తనిఖీలను పూర్తిగా పూర్తి చేసిన తర్వాతే ప్రజలకు అనుమతి ఇస్తారు. రాబోయే రెండు, మూడు నెలల్లో అన్ని పనులు పూర్తి చేసి, ఈ అద్భుత గ్లాస్ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

హైదరాబాద్ లో ఎంతమంది ఐటీ ఉద్యోగులు ఉన్నారో తెలుసా ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha