Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అధికారిని చెప్పుతో కొట్టిన రైతు

అధికారిని చెప్పుతో కొట్టిన రైతు

వార్త 2 months ago

Slipper Shot : ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి, కార్యాలయాల చుట్టూ తిప్పించుకునే ధోరణి పతాక స్థాయికి చేరితే సామాన్యుడి ఆగ్రహం ఏ విధంగా ఉంటుందో నిరూపించేలా కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో ఒక తీవ్రమైన ఘటన చోటుచేసుకుంది.

బసప్ప దొడమణి అనే స్థానిక రైతు తన భూమికి సంబంధించిన భూసేకరణ (Land Acquisition) పరిహారం కోసం గత కొంతకాలంగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా, అధికారుల నుండి సరైన స్పందన లేకపోగా, నిరంతరం వేధింపులకు గురికావడంతో అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే శనివారం టౌన్ డెవలప్‌మెంట్ అథారిటీ (Town Development Authority) కార్యాలయానికి చేరుకున్న ఆ రైతు, అక్కడి అధికార యంత్రాంగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఓ అధికారిని చెప్పుతో కొట్టాడు. ఈ హఠాత్పరిణామంతో ఒక్కసారిగా సదరు ప్రభుత్వ కార్యాలయం రణరంగంగా మారింది.

Read Also : TMCలో కీలక పరిణామం !

భయాందోళనలో అధికారులు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన వీడియో

రైతు ఒక్కసారిగా తిరగబడటంతో కార్యాలయంలోని మిగతా అధికారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఉద్రిక్త పరిస్థితిని చూసి ప్రాణభయంతో కొందరు అధికారులు తక్షణమే పక్కనే ఉన్న గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని లోపల లాక్ చేసుకున్నారు. ఈ మొత్తం ఉదంతాన్ని అక్కడ ఉన్న కొందరు మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేయగా, ఈ ‘స్లిప్పర్ షాట్’ వీడియో సామాజిక మాధ్యమాల్లో (Social Media) అత్యంత వేగంగా వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పే అయినప్పటికీ, ఏళ్ల తరబడి రైతులకు పరిహారం ఇవ్వకుండా ముప్పతిప్పలు పెట్టే అవినీతి, నిర్లక్ష్య అధికారులకు ఇదొక గుణపాఠం అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

రాహుల్ వ్యూహాలు.. బీజేపీకి బలం చేకూరుస్తున్నాయి - మాజీ సీఎం పినరయి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha