Dailyhunt
Harish Rao House Arrest: మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్

Harish Rao House Arrest: మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్

వార్త 1 week ago

Harish Rao House Arrest: మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను పరామర్శించేందుకు ఆయన పరిగి పర్యటనకు వెళ్లాల్సి ఉండగా, పోలీసులు అడ్డుకున్నారు.

హరీశ్ రావు నివాసం వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించి, ఆయనను బయటకు రాకుండా ఆంక్షలు విధించారు.

Read Also:Karimnagar Crime: కవల పిల్లలను కడతేర్చిన కసాయి తండ్రి!

Harish Rao House Arrest: బీఆర్ఎస్ నేతలపై ఆంక్షలు

కేవలం హరీశ్ రావు మాత్రమే కాకుండా, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు ఉమ్మడి రంగారెడ్డి మరియు వికారాబాద్ జిల్లాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ బాధితులను కలవడానికి వెళ్లకుండా నేతలపై పోలీసులు ఆంక్షలు విధించడంతో ఉద్రిక్తత నెలకొంది.

మాజీ ఎమ్మెల్యే అరెస్టు

ఇదే క్రమంలో పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. పరిగి ప్రాంతంలో రైతుల సమస్యలపై గళం ఎత్తేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ నేతలను వరుసగా అదుపులోకి తీసుకోవడం మరియు గృహ నిర్బంధాలు చేయడంపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

కన్నకూతుర్లను బావిలో పడేసిన కిరాతకుడు.. కుటుంబం మొత్తం జైలుకు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha