Agri Startups:గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మార్చడంలో మహిళా అగ్రిప్రెన్యూర్స్ పాత్ర కీలకం అని హైదరాబాద్ జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ ఐసీఏఆర్-నార్మ్ డైరెక్టర్ డాక్టర్ రామన్ మీనాక్షి సుందరం స్పష్టం చేశారు.
వ్యవసాయాన్ని లాభసాటి వాణిజ్యంగా తీర్చిదిద్దే సత్తా మహిళా పారిశ్రామికవేత్తలకు ఉందని రాజేంద్రనగర్ నార్మ్ తాజా పాలసీ పేపర్ వెల్లడించింది. సరైన మౌలిక వసతులు సాంకేతిక తోడ్పాటు అందిస్తే గ్రామీణ నిరుద్యోగానికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
Adulterated Pheni Seized: పండగ పూట విషం అవుతున్న స్వీట్లు
Path to employment for women through agri-startups
వెనుకడుగు వేస్తున్న అగ్రి స్టార్టప్‌ల ప్రయాణం
గ్లోబల్ స్టార్టప్ డేటా ప్లాట్‌ఫామ్ ప్రకారం 2015 నుంచి 2024 మధ్య కాలంలో భారతీయ వ్యవసాయ స్టార్టప్‌ల సంఖ్య ఏటా 22 శాతం పెరుగుతోంది. అయితే భారతీయ మహిళలు స్థాపించే వ్యవసాయ స్టార్టప్‌ల సంఖ్య మాత్రం సగటున 26 శాతం క్షీణించింది. ఆస్తులు మహిళల పేరిట లేకపోవడం వలన బ్యాంకుల నుంచి పూచీకత్తు లేని రుణాలు పొందలేకపోతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం డిజిటల్ మార్కెటింగ్ పద్ధతులపై తగిన శిక్షణ లభించక అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి.
Agri Startups:మార్పు తెచ్చే కీలక విధానాలు
గ్రామీణ మహిళా అగ్రిప్రెన్యూర్లలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఇంక్యుబేషన్ కేంద్రాలను జిల్లా స్థాయికి విస్తరించాలి. సులభతర వడ్డీ రేట్లతో ఎలాంటి పూచీకత్తు లేకుండా ప్రత్యేక రుణాలు అందించాలని నార్మ్ సూచించింది. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల వినియోగంపై సమగ్ర శిక్షణ ఇవ్వాలి. మహిళా ఎఫ్‌పీవోలు ఏర్పాటు చేసి స్థానిక ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్‌తో అనుసంధానం కల్పించాలి.
Epaper: epaper.vaartha.com

