Dailyhunt
అగ్రికల్చర్ హబ్ గా రాయలసీమ.. మంత్రి సత్యప్రసాద్

అగ్రికల్చర్ హబ్ గా రాయలసీమ.. మంత్రి సత్యప్రసాద్

వార్త 2 weeks ago

Rayalaseema Agriculture Hub: త్వరలోనే రాయలసీమ రాష్ట్రంలో ఒక అగ్రి కల్చర్ హబ్గా మారనుందని శ్రీ సత్యసాయి జిల్లా ఇన్చార్జి మంత్రి సత్యప్రసాద్ పేర్కొన్నారు.

కలెక్టరేట్లో బుధవారం జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రులు సవితమ్మ, సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు వల్లె సింధూర రెడ్డి, ఎం.ఎస్. రాజు, కందికుంట వెంకటప్రసాద్, జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ధర్మవరం నియోజవర్గ టిడిపి ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, డిసీఎం ఎస్ చైర్మన్ నెట్టెం వెంకటేష్, ఇరిగేషన్ డైరెక్టర్ పత్తి చంద్రశేఖర్, ఇతర డైరెక్టర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ సమావేశాన్ని ప్రారంభించి వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధకం, విద్య, వైద్యం, జిల్లాలో చేపట్టిన పలు రహదారుల నిర్మాణం జిల్లాలోని హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు వివరాలు తదితర అంశాలను సమావేశానికి హాజరైన మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సూపర్ సిక్స్ పధకాలను సూపర్ హిట్ చేశామని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. సిఎం సహకారంలో జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నడిపిద్దామని పిలుపునిచ్చారు.

Read Also: Withdrawal of Property Tax Hike: ఆస్తి పన్ను పెంపు ఉపసంహరించుకోవాలి.. బాబూరావు

 Rayalaseema Agriculture Hub: Rayalaseema as an agriculture hub.. Minister Satya Prasad

Rayalaseema Agriculture Hub: పార్టీ కార్యాలయ ప్రారంభం

తొలుత జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం. ఎస్. రాజు ఆధ్వర్యంలో జరిగిన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పుట్టపర్తి పోలీస్ పరేడ్ గ్రౌండ్కి వెళ్లే దారిలో, వై జంక్షన్ సమీపంలోని నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ కార్యాలయం నిత్యం అందుబాటులో ఉంటుందని, కార్యకర్తల సంక్షేమం కోసం కార్యాలయం తలుపులు 24గంటలు తెరిచే ఉంటాయని తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లాను తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా చేయడమే లక్ష్యంగా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం. ఎస్. రాజు కష్టపడి పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు

అలాగే పుట్టపర్తిలోని రెవెన్యూ భవన్లో నూతనంగా నిర్మించిన ఎస్.ఆర్. శంకరన్ హాల్ను మంత్రి అనగాని సత్యప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ హాల్ను రెవెన్యూ శాఖ ఉద్యోగుల వినియోగం కోసం అంకితం చేశారు. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యుత్ పథకం అమలులో భాగంగా, ఎనుములపల్లిలో లబ్దిదారులకు ధ్రువపత్రాలను పంపిణీ చేశారు. అలాగే పుట్టపర్తి పురపాలక పరిధిలోని యనుమలపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్దిదారులు నాగలక్షమ్మకు రూ.4,000, ప్రసాద్ (చేనేత పింఛన్)కు రూ.4,000, నాగరాజుకు మెడికల్ పింఛన్ కింద రూ.15,000 నగదును మంత్రి చేతుల మీదుగా అందజేశారు.

చుక్కల భూములకు పట్టాల జారీ

నల్లమాడ మండలం గోపీపల్లి గ్రామం సుమారు 80 ఎకరాల చుక్కల భూములకు జిల్లా కలెక్టర్, జెసిలు, ప్రత్యేక చొరవ చూపించి 125 మంది రైతులకు సంబందించిన 169 యల్ పియంలు 305.68 ఎకరముల భూమిని చుక్కల భూముల నుండి పట్టా భూములుగా మారుస్తూ చారిత్రాత్మక ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర రెవిన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ చేతుల మీదుగా గోపీపల్లి గ్రామ రైతులకు ఎన్ఎసి కాపీలను జారీ చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

అమరావతి బిల్లు ఆమోదం.. ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha