లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన అసోసియేట్ డీన్ గోవర్ధన్
ACB Raids in Agriculture University: ఫెర్టిలైజర్, సీడ్ కంపెనీ ఏర్పాటుకు లైసెన్స్ కోసం లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అసోసియేట్ డీన్ మంతటి గోవర్ధన్ ఏసీబీ అధికారులు పట్టుకున్న సంఘటన మంగళవారం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఏసిబి డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి ఫెర్టిలైజర్ సీడ్ కంపెనీ పెట్టడానికి గత సంవత్సరం మార్చి 2025 లో లైసెన్స్ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకున్నాడు.
Read Also:Auto LPG Supply: అంతరాయం లేకుండా ఆటో ఎల్పిజి సరఫరా
Acb traps agriculture university Associate Dean Govardhan Hyderabad
ACB Raids in Agriculture University: లైసెన్స్ కోసం వేధింపులు
అయితే చాలా నెలలు అవుతున్న అతనికి లైసెన్స్ రాకపోవడంతో రాజేందర్నగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని అసోసియేషన్ డీన్ మంతటి గోవర్ధన్ కలిశాడు. అయితే 1,25,000 ఇస్తే లైసెన్స్ ఇప్పిస్తానని గోవర్ధన్ అతనికి చెప్పడంతో అతను 25 వేల రూపాయలు యూపీఐ పేమెంట్ చేశాడు. దీంతో అతనికి కొద్ది రోజుల క్రితం లైసెన్స్ వచ్చింది. అయితే గోవర్ధన్ మిగతా లక్ష రూపాయల కోసం ఫోన్ చేసి వేధిస్తున్నాడు. ఫిర్యాదు దారుడు దగ్గర లక్ష రూపాయలు లేకపోవడంతో అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ఏసీబీ వల.. రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్
ఏసీబీ అధికారులు మంగళవారం సాయంత్రం ఫిర్యాదు దారునికి లక్ష రూపాయలు ఇచ్చి యూనివర్సిటీలోని గోవర్ధన్ చాంబర్కు పంపించారు. అక్కడ ఫిర్యాదు దారుడు గోవర్ధన్కి లక్ష రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అదేవిధంగా అతని ఇంట్లో కార్యాలయంలో ఏసీబీ అధికారు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అతని నాంపల్లి లోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

