Dailyhunt
అంతరాయం లేకుండా ఆటో ఎల్పిజి సరఫరా

అంతరాయం లేకుండా ఆటో ఎల్పిజి సరఫరా

వార్త 3 weeks ago

పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

Auto LPG Supply: ఆటో ఎల్పీజీని ఎక్కువగా తెప్పించి తమ పరిధిలోని బంకులన్నింటికీ అంతరాయం లేకుండా సరఫరా చేయాలని ఆయా ప్రయివేట్ ఆటో ఎల్పిజి కంపెనీలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు.

వారం క్రితం నిర్వహించిన సమీక్షలో చాలావరకు కంపెనీలు సరఫరాను నిరాటంకంగా కొనసాగిస్తున్నాయన్నారు. అయితే కొన్ని కంపెనీలు మాత్రం పనితీరులో పెద్దగా చూపించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతినకుండా ఉండాలంటే ఆటో ఎల్పీజీ సరఫరా ఆగకుండా చూడటం చాలా ముఖ్యమని ఆ కంపెనీలకు తేల్చిచెప్పారు.

Read Also: Moinabad Drug Case: డ్రగ్స్ పార్టీ కేసు.. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

 Companies that improved performance in a week.. Stephen Ravindra

కంపెనీల పనితీరుపై సమీక్ష

ఈ విషయమై మంగళవారం పౌరసరఫరాల శాఖ రాష్ట్ర కార్యాలయంలో ఆటో ఎల్పిజి ప్రయివేటు ఆయిల్ కంపెనిలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆటో ఎల్పిజి సరఫరాలో అంతరాయం లేకుండా పనిచేస్తున్న కంపెని యాజమాన్యాలను ఆయన ప్రశంసించారు. గడిచిన వారం రోజుల్లో మొత్తం 363 మెట్రిక్ టన్నుల ఆటో ఎల్పీజీని తెప్పించి సరఫరా చేశామన్నారు. మూతపడిన 17 బంకులను మళ్లీ తెరిపించామని వెల్లడించారు. గ్యాస్ సరఫరాను పెంచి, మూతపడిన బంకులను మళ్లీ తెరిపించడంలో సూపర్ గ్యాస్, గో గ్యాస్, టోటల్ ఎనర్జీస్, ప్రైమ్ ఫ్యూయల్ కంపెనీలు చేసిన కృషిని కమిషనర్ అభినందించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

జిల్లా కలెక్టర్‌కు GPOల వినతి.. ఇంక్రిమెంట్ల మంజూరుకు కోరిక!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha