Fake Form-7 Detected : హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో మరో అనుమానాస్పద ఫారం-7 వెలుగులోకి వచ్చింది.
ముషీరాబాద్ నియోజకవర్గంలోని భోలక్‌పూర్ డివిజన్‌లో ఐదేళ్ల క్రితమే మరణించిన వ్యక్తి పేరుతో ఆయన భార్య ఓటును రద్దు చేయాలంటూ దరఖాస్తు చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. భోలక్‌పూర్‌కు చెందిన రఫీకుద్దీన్ ఐదేళ్ల క్రితమే మరణించినట్లు సమాచారం. అయితే ఆయన పేరుతోనే ఆయన భార్య సుల్తానా ఓటును రద్దు చేయాలంటూ ఆన్‌లైన్‌లో ఫారం-7 దరఖాస్తు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల అధికారులు విచారణ చేపట్టిన సమయంలో సుల్తానా జీవించి ఉన్నట్లు నిర్ధారణ కావడంతో దరఖాస్తుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇది బోగస్ ఫారం-7గా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఐదేళ్ల క్రితమే మరణించిన వ్యక్తి పేరుతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఎలా నమోదైంది? దరఖాస్తు చేసేందుకు ఆయన వివరాలను ఎవరు ఉపయోగించారు? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సుల్తానా ఓటును రద్దు చేయాలంటూ దరఖాస్తు చేసిన వ్యక్తిని గుర్తించి, పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులపై పోలీసు కేసు నమోదు చేయాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ యాదవ్ కోరారు.
TDP MPs Meet Revanth Reddy: విజయవాడ దసరా, ఉత్సవ్ 2.0కు సీఎం రేవంత్‌ను ఆహ్వానించిన టీడీపీ
Fake Form-7 Detected
Fake Form-7 Detected : 31 ఓట్ల రద్దు దరఖాస్తుల తర్వాత మరో ఘటన
ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్ డివిజన్‌లోని పోలింగ్ సెంటర్-210లో ఇటీవల 31 మంది ఓటర్ల పేర్లను తొలగించాలంటూ దరఖాస్తులు వచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దరఖాస్తులు బీజేపీ బీఎల్ఏకు సంబంధించినవిగా పేర్కొంటూ వివాదం చెలరేగింది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతుండగానే భోలక్‌పూర్‌లో మరో అనుమానాస్పద ఫారం-7 బయటపడటం మరింత చర్చకు దారితీసింది. SIR ప్రక్రియలో బోగస్ ఫారం-7 పత్రాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయంటూ రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. కొన్ని పత్రాలపై తెలంగాణ అసెంబ్లీ నంబర్, నియోజకవర్గం పేరు, బూత్ నంబర్, ఓటరు పేరు వంటి వివరాలను ముందుగానే టైప్ చేసినట్లు చెబుతున్నారు. ఇలాంటి పత్రాలు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని బూత్‌లకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచినట్లు ప్రచారం జరుగుతోందని నేతలు పేర్కొంటున్నారు. అయితే ఈ పత్రాలను ఎవరు సిద్ధం చేశారు, ఎవరి ద్వారా పంపిణీ చేస్తున్నారు అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
Read Also hindi news: hindi.vaartha.c
తెలుగు రాష్ట్రాల్లో ఎల్లుండి నుంచే దసరా సెలవులు.. ఎన్ని రోజులు అంటే?

