Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు

ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు

వార్త 2 weeks ago

High Court: ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఉద్యోగుల సంఘం చేసిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశించింది.

ఐఏఎస్ అహ్మద్ అనర్హుడంటూ హైకోర్టులో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై హైకోర్టులో విచారణ కొనసాగుతుండగా పిటిషన్ ను కొట్టి వేయాలని అహ్మద్ బాబు అప్పీల్ చేసుకున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం పిటిషన్పై విచారణ జరిపి స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఉద్యోగుల సంఘం ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Read also: USA Crime News : టెక్సాస్ కాల్పులు ఇద్దరి మృతి అసలు కారణం ఏంటి?

గత కొన్ని రోజులుగా అహ్మద్ బాబుకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు అన్ని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయాల ముందు మధ్యాహ్న భోజన సమయంలో ఆందోళనలు చేసారు. చాలా మంది ఉద్యోగుల ప్రమోషన్లను అహ్మద్ తొక్కిపెడుతున్నారంటూ ఉద్యోగ సంఘాలు ఆరోపిం చాయి. దీనికి సంబంధించి నిన్న(సోమవారం) అధికారుల తో మంత్రి పయ్యావుల కేశవ్ సమావేశమై కోర్టు ఆదేశాలను పాటించాలని, ప్రమోషన్లపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ తరుణంలో అహ్మద్ బాబు అప్పీల్కు వెళ్లడంతో హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖతో పాటు అహ్మద్ బాబు నిర్వహిస్తున్న శాఖల్లో ఏదీ సవ్యంగా లేనట్లు కనిపి స్తోందని సింగిల్ జడ్జి చేసిన అబ్జర్వేషన్ (ప్రస్తావన)ను ధర్మాసనం పక్కనపెట్టింది. ఉద్యోగ సంఘం వినతిని పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha