INS Taragiri Warship: ఆత్మనిర్బర్ భారత్తో దేశం శరవేగంగా దూసుకెళ్తాంది. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంలో కీలక ముందడుగు పడింది. నౌకాదళ అమ్ముల పొదిలో మరో అత్యాధునిక అస్త్రం చేరింది.
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధనౌక ఐఎన్ఎస్ తారాగిరి జలప్రవేశం చేసింది. విశాఖ నేవ లాక్ యార్డులో శుక్రవారం ఈనౌకను కేంద్రరక్షణ మంత్రి రాజ్నాథ్్సంగ్ జాతికి అంకితంచేశారు. ఈ కార్యక్రమంలో సీడీఎస్ జనరల్ అనిల్ చౌహన్, నేవీ చీఫ్ దినేశ్ కె.త్రిపాఠి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also: Minister Seethakka: గ్రామ సభలు విజయవంతం

ముంబయిలోని మజగావ్ డాక్స్ లిమిటెడ్ నిర్మించిన ఈ యుద్ధ నౌక సముద్ర రక్షణలో కీలక పాత్ర పోషించనుంది. నీలగిరి శ్రేణి17 ఏలో ఇది నాలుగోది. ఆత్మనిర్బర్ భారత్లో భాగంగా 75 శాతానికి పైగా స్వదేశీ సాంకేతిక పారిశ్రామిక రక్షణ ఉత్ప త్తుల తయారీ సంస్థలు ఇందులో భాగస్వామ్యమైనట్టు నేవీ వర్గాలు పేర్కొన్నాయి. శత్రువుల రాడార్ లకు చిక్కుకుండా అత్యంత రహస్యంగా పనిచేయడం దీని ప్రత్యేకత. గాలిలోని లక్ష్యాలు, ఉపరితలంతో పాటు సముద్రగర్భంలోని జలాంతర్గాములను ఏకకాలంలోనే ఇది ఎదుర్కోగలదు.
ఈ యుద్ధ నౌక బరువు 6,670 టన్నులు
గతేడాది నవంబరు 28న ఐఎన్ఎస్ తారాగిరిని నేవీకి అప్పగించారు. మొత్తం 149 మీటర్ల పొడవు, 17.8 మీటర్ల వెడల్పు ఉండే ఈ యుద్ధ నౌక బరువు 6,670 టన్నులు. కంబైన్డ్ డీజిల్ లేదా గ్యాస్తో సముద్ర జలాల్లో గంటకు 28 నాట్స్ వేగంతో ఐఎన్ఎస్ తారాగిరి ప్రయాణించగలదు. దీనిలో స్టెల్త్ ఫ్రిగేట్తో కూడిన ఆధునిక సాంకేతికత ఉంది. బరాక్ వంటి విమాన విధ్వంసక, బ్రహ్మోస్ నౌకా విధ్వంసక క్షి పణులు ఇందులో ఉన్నాయి. యాంటీసబ్మెరైన్ వార్ఫేర్ వ్యవస్థ, శత్రువుల జాడ, ప్రమాదాన్ని ముందే గుర్తించే రాడార్ వ్యవస్థ ఇందులో ఉంది.
ఇక, 1980 నుంచి 2013 వరకు నౌకదళానికి సేవలందించిన పాతతరం ఐఎస్ఎస్ తారాగిరి వారసత్వాన్ని ఇది కొనసాగించనుంది. స్టెల్త్, ఆటోమేషన్, అద్భుతమైన పోరాట శక్తి కలయికతో రూపుదిద్దుకున్న కొత్త తారాగిరి భారత రక్షణ ఉత్పాదక వ్యవస్థ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతుందని షిప్ కమాండింగ్ ఆఫీసర్ హేమంత్ గోపాల్ తెలిపారు. హిందూ మహాసముద్రంలో చోటుచేసుకుంటోన్న భౌగోళిక పరిణామాల దృష్ట్యా ఐఎన్ఎస్ తారాగిరి నౌకాదళానికి కీలకంగా మారనుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

