Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళల ఉన్నత విద్యలో తెలంగాణ టాప్

మహిళల ఉన్నత విద్యలో తెలంగాణ టాప్

వార్త 2 months ago

Telangana : దేశంలోని మహిళా ఉన్నత విద్య రంగంలో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. ఎడ్యుకేషన్ వరల్డ్ -సంస్థ ప్రకటించిన హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ 2026-27లో వీరనారి చాకలి ఇలమ్మ మహిళా విశ్వవిద్యాలయం దేశంలో అన్ని మహిళా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో ప్రథమ -స్థానం సాధించింది.

ఈ విశ్వవిద్యాలయం మొత్తం 870 మార్కులతో దేశవ్యాప్తంగా అగ్రస్థానాన్ని దక్కించుకొని ప్రముఖ విశ్వ విద్యాలయాలను వెనక్కి నెట్టింది.

Read Also: Minister Seethakka: గ్రామ సభలు విజయవంతం

 Telangana: Telangana tops in women’s higher education

861 మార్కులతో రెండోస్థానం

వీరనారి చాకలి ఇలమ్మ మహిళా విశ్వవిద్యాలయం 870 మార్కులతో మొదటి స్థానం దక్కించుకోగా.. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 861 మార్కులతో రెండోస్థానంలో, కొడైకెనాల్లోని మదర్ థెరిసా మహిళా విశ్వవిద్యాలయం 838 మార్కులతో మూడవ స్థానంలో ఉండగా.. జంషెడ్పూర్ మహిళా విశ్వవిద్యాలయం 757 మార్కులతో 4వ స్థానంలో నిలిచింది. పరిశోధన.

ఆవిష్కరణలకి 138 మార్కులు రాగా, అధ్యాపకుల నైపుణ్యానికి 131 మార్కులు, మౌలిక వసతులకి 127 మార్కులు, అధ్యావక సంక్షేమానికి 75 మార్కులు, పాఠ్యప్రణాళిక, బోధనకి 69 మార్కులను కేటాయించగా, ప్లేస్ మెంట్కి 65 మార్కులు, ఇండస్ట్రీ ఇంటర్ఫేస్కి 64 మార్కులు, అంతర్జాతీయత అండ్ నాయకత్వంలో 66 మార్కులు వచ్చాయి. ఈ ఫలితాలు విశ్వవిద్యా లయం అకాడమిక్ నాణ్యత, పరిశోధన, మౌలిక వసతులు, విద్యార్థుల అభివృద్ధిలో సాధించిన సమగ్ర పురోగతిని ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఘనత తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం కాగా, మహిళా విద్య అభివృద్ధిలో ఈ విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తున్నదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

3,699 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు సీజ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha