MS Dhoni: ఐపీఎల్ 2027 సీజన్ మొదలు కావడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున మహేంద్ర సింగ్ ధోనీ ప్లేయర్‌గా బరిలోకి దిగుతాడా లేదా అన్నదానిపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
45 ఏళ్ల ధోనీ వచ్చే సీజన్‌లో ఆటగాడిగా కాకుండా సీఎస్కే మెంటార్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందంటూ ప్రచారం ఊపందుకుంది. ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్ ధోనీ భవిష్యత్తుపై నిర్ణయాన్ని అతనికే వదిలేసినప్పటికీ, ఆయన మైదానంలో ప్లేయర్‌గా కనిపించడం కష్టమేనని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.
Read Also : PCB vs England Test :ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం.. ఏడుగురు క్రికెటర్లపై పీసీబీ వేటు!
MS Dhoni in IPL 2027.. As a player or as a CSK mentor?
MS Dhoni: ఫిట్‌నెస్ సవాళ్లు, హెడ్ కోచ్ మార్పు
ధోనీ మెంటార్ అవతారమెత్తడానికి ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న వయసుతో పాటు మోకాలి సమస్యలు ధోనీ ఫిట్‌నెస్‌కు పెద్ద సవాలుగా మారాయి. 2026 సీజన్‌లో మ్యాచ్‌లు ఆడకపోయినా డగౌట్ నుంచే జట్టుకు మార్గదర్శనం చేశారు. రోజూవారీ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడకపోవడంతో మ్యాచ్ ప్రాక్టీస్ తగ్గడం మరో కారణంగా మారింది. సీఎస్కేను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ జూలై 2026లో జట్టు నుంచి తప్పుకుని ఇంగ్లండ్ రెడ్ బాల్ టీమ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో సీఎస్కే కొత్త హెడ్ కోచ్ వేటలో పడింది. భారత మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీ పేరు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది.
ఫ్రాంచైజీ వాటాల పుకార్లపై సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టత
గత కొన్ని రోజులుగా ధోనీ సీఎస్కే ఫ్రాంచైజీలో 25 శాతం లేదా 18 శాతం వాటా కోరారంటూ సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను సీఈఓ కాశీ విశ్వనాథన్ ఖండించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ ఆధారరహితమైనవని స్పష్టం చేశారు. ధోనీ తీసుకునే ఏ నిర్ణయానికైనా సీఎస్కే యాజమాన్యం పూర్తి ప్రాధాన్యం ఇస్తుందని తేల్చి చెప్పారు. ధోనీ మైదానంలో బ్యాట్ పట్టి అలరిస్తాడా లేక మెంటార్‌గా వ్యూహాలు రచిస్తాడా అనేది త్వరలోనే స్పష్టం కానుంది.

