Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐపీఎల్ అవార్డుల్లో 'వైభవ్' దే సందడి అంత !!

ఐపీఎల్ అవార్డుల్లో 'వైభవ్' దే సందడి అంత !!

వార్త 1 week ago

IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) 19వ సీజన్ ముగింపు వేడుకల్లో ఒకే ఒక్క పేరు మారుమోగిపోయింది.. అదే రాజస్థాన్ రాయల్స్ (RR) సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ.

ఈ మెగా టోర్నీలో తన సంచలన సిక్సర్ల వర్షంతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన ఈ 15 ఏళ్ల కుర్రాడు, ముగింపు అవార్డుల ప్రదానోత్సవంలోనూ పూర్తిగా ఆధిపత్యం చెలాయించాడు. టోర్నమెంట్‌లో అత్యధికంగా 776 పరుగులు సాధించి ప్రతిష్టాత్మకమైన ‘ఆరెంజ్ క్యాప్’ను తన సొంతం చేసుకున్నాడు. ఇంతటి చిన్న వయస్సులోనే అత్యంత ప్రభావవంతమైన ఆటతీరును ప్రదర్శించినందుకు గానూ టోర్నీ ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ (MVP) గా నిలిచాడు. అంతేకాకుండా, సీజన్ మొత్తంలో అత్యధికంగా 71 సిక్సర్లు బాదిన ఆటగాడిగా, అలాగే నమ్మశక్యం కాని విధంగా 237.31 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి ‘బెస్ట్ స్ట్రైక్ రేట్’ అవార్డును, అత్యుత్తమ యువ ఆటగాడిగా ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డును కూడా కైవసం చేసుకుని రికార్డు సృష్టించాడు.

ఐపీల్ 2026 లో వైభవ్ సూర్యవంశీ గెలిచిన కప్స్ , రివార్డ్స్

  • ఆరెంజ్ క్యాప్ (Orange Cap):
  • సీజన్‌లో అత్యధిక పరుగులు (16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు) చేసినందుకు.
  • రివార్డ్: రూ. 10 లక్షల నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రం.
  • మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (MVP)
  • టోర్నమెంట్‌లో అత్యుత్తమ ఇంపాక్ట్ చూపినందుకు (436.5 పాయింట్లు).
  • రివార్డ్: రూ.15 లక్షల నగదు బహుమతి.
  • ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ (Emerging Player)
  • ఈ సీజన్ బెస్ట్ యంగ్ ప్లేయర్‌గా నిలిచినందుకు.
  • రివార్డ్: రూ.10 లక్షల నగదు బహుమతి.
  • సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీసన్ (Super Sixes)
  • క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొడుతూ అత్యధికంగా 72 సిక్సర్లు బాదినందుకు.
  • రివార్డ్: రూ.10 లక్షల నగదు బహుమతి.
  • సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీసన్ (Super Striker)
  • ఈ సీజన్‌లో అత్యధికంగా 237.30 స్ట్రైక్ రేట్ నమోదు చేసినందుకు.
  • రివార్డ్: ఒక సరికొత్త లగ్జరీ కార్ (Sierra Car).
  • మొత్తం అందుకున్న నగదు బహుమతి: రూ.45 లక్షలు

Read Also : ఇప్పటి వరకు IPL గెలిచిన జట్లు ఇవే..!!

15 ఏళ్లకే టాటా సియారా కారు సొంతం

కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లీగ్‌లో సీనియర్ అంతర్జాతీయ బౌలర్లను దీటుగా ఎదుర్కొని, సిరీస్ అత్యుత్తమ ప్రదర్శనకు గానూ లగ్జరీ ‘టాటా సియారా’ (Tata Sierra) కారును బహుమతిగా గెలుచుకుని వైభవ్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. అవార్డుల స్వీకరణ అనంతరం ఈ వండర్ కిడ్ మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి ఆటగాళ్ల మధ్య అత్యంత ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఎలా ఆడాలో ఈ సీజన్ ద్వారా తాను నేర్చుకున్నానని ఎంతో పరిణతితో చెప్పుకొచ్చాడు. ఈ విజయం తన బాధ్యతను మరింత పెంచిందని, రాబోయే రోజుల్లో తన ఫిట్‌నెస్ స్థాయిలను మరింతగా మెరుగుపరుచుకోవడంపైనే పూర్తి దృష్టి పెడతానని స్పష్టం చేశాడు. క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్సులో ఐపీఎల్ సామ్రాజ్యాన్ని శాసించిన వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో భారత జట్టుకు ఒక అద్భుతమైన ఆస్తిగా మారుతాడని మాజీ క్రికెటర్లు మరియు విశ్లేషకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ముంబై కెప్టెన్ తిలక్ వర్మనేనా ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha