Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇప్పటి వరకు IPL గెలిచిన జట్లు ఇవే..!!

ఇప్పటి వరకు IPL గెలిచిన జట్లు ఇవే..!!

వార్త 2 weeks ago

IPL : గత రెండు నెలలుగా క్రికెట్ ప్రేమికులను విపరీతంగా అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మరికొన్ని గంటల్లో ముగింపు దశకు చేరుకోనుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ తుది పోరులో సత్తా చాటి, సరికొత్త చరిత్ర సృష్టించేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తమ అస్త్రశస్త్రాలన్నింటినీ సిద్ధం చేసుకున్నాయి.

గత సీజన్‌లో చాంపియన్‌గా నిలిచిన రజత్ పాటీదార్ నేతృత్వంలోని ఆర్‌సీబీ ఈసారి కూడా కప్‌ను ముద్దాడి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుంటే, అటు శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు ట్రోఫీని ఎగురవేసి రెండోసారి ఐపీఎల్ విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. ఈ ఇరు జట్ల మధ్య సాగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Read Also : ఐపీఎల్ క్వాలిఫైయర్-2లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం

ఐపీఎల్ 18 ఏళ్ల చరిత్ర – ఇప్పటివరకు విజేతలుగా నిలిచిన జట్లు ఇవే!

2008లో ప్రారంభమైన ఐపీఎల్ ప్రస్థానం ఇప్పటివరకు 18 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ లీగ్ చరిత్రను పరిశీలిస్తే.. రోహిత్ శర్మ నేతృత్వంలో ముంబై ఇండియన్స్ (MI), ఎంఎస్ ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు అత్యధికంగా చెరో 5 సార్లు ట్రోఫీని గెలుచుకుని అత్యంత విజయవంతమైన జట్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు 3 సార్లు ఛాంపియన్‌గా నిలవగా.. రాజస్థాన్ రాయల్స్ (RR), డెక్కన్ చార్జర్స్ (DCH), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), గుజరాత్ టైటాన్స్ (GT) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు చెరో ఒకసారి ఐపీఎల్ కప్‌ను సొంతం చేసుకున్నాయి. మరి ఈ రాత్రి జరగబోయే గ్రాండ్ ఫైనల్‌లో రజత్ పాటీదార్ వరుసగా రెండోసారి ఆర్‌సీబీకి కప్ అందిస్తారా, లేక శుభ్‌మన్ గిల్ సరికొత్త వ్యూహాలతో గుజరాత్‌ను విజేతగా నిలుపుతారా అనేది మరికొద్ది సేపట్లో తేలనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

బ్యాడ్ లక్ వై'బాయ్'

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha