IPL 2026 Run Chase Records: ఐపీఎల్ 2026 సీజన్ లో, బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టిస్తున్నారు. ఏ స్కోరు కూడా భద్రం కాదనే రీతిలో ఈ సీజన్‌లో భారీ లక్ష్యాలు సైతం అతి సులువుగా ఛేజ్ అవుతున్నాయి.
Read Also:Riyan Parag: రియాన్ పరాగ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత.. అసలేం జరిగిందంటే?
రికార్డుల పరంపర – గణాంకాలు
కేవలం 41 మ్యాచ్‌లు ముగిసే సమయానికే 10 సార్లు 200కు పైగా టార్గెట్లు విజయవంతంగా ఛేజ్ అయ్యాయి.2025లో మొత్తం 74 మ్యాచ్‌ల్లో 9 సార్లు మాత్రమే ఈ ఘనత నమోదైతే, ఈసారి సగం సీజన్‌కే ఆ రికార్డు బద్దలైంది.గతంలో 2023లో 8 సార్లు, 2024లో 6 సార్లు మాత్రమే 200+ స్కోర్లు ఛేజ్ అయ్యాయి.ఐపీఎల్ చరిత్రలోనే టాప్-5 రన్ ఛేజ్‌లలో మూడు ఈ ఒక్క సీజన్ లోనే నమోదవ్వడం విశేషం.
బ్యాటర్ల వీరవిహారం – కొన్ని ఉదాహరణలు
ఢిల్లీ క్యాపిటల్స్ 264 పరుగులు చేసినా పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది.సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ 243 పరుగులు చేసినప్పటికీ విజయం సాధించలేకపోయింది.రాజస్థాన్ నిర్దేశించిన 229 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ అలవోకగా ఛేజ్ చేసింది.ఈ సీజన్‌లో బ్యాటర్ల ఆధిపత్యం చూస్తుంటే, మున్ముందు 300 పరుగుల స్కోరు నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదనిపిస్తోంది.
IPL 2026 Run Chase Records: ఐస్‌లాండ్ క్రికెట్ సెటైర్లు
ఐపీఎల్‌లో జరుగుతున్న ఈ పరుగుల వేటను చూసి ఐస్‌లాండ్ క్రికెట్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఫన్నీగా స్పందించింది. “ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా జట్టు సేఫ్ జోన్‌లో ఉండాలంటే కనీసం 350 పరుగులు చేయాలి” అంటూ సెటైర్లు వేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
ముంబై ఇండియన్స్ ఓటమితో కన్నీళ్లు పెట్టుకున్న నీతా అంబానీ..

