Riyan Parag: రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ రియాన్ పరాగ్‌పై బీసీసీఐ (BCCI) క్రమశిక్షణ చర్యలు తీసుకున్న వార్త ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను అతనికి జరిమానా విధించడం జరిగింది.
Read Also: Vaibhav Suryavanshi: రాజస్థాన్ 'డైమండ్' పై ముంబై కన్ను!
ఏం జరిగింది?
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ (ఈ-సిగరెట్) చేస్తూ లైవ్ కెమెరాకు చిక్కాడు.దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.21 ప్రకారం ఆటకు అప్రతిష్ఠ కలిగించే ప్రవర్తన కింద పరాగ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు బీసీసీఐ నిర్ధారించింది.
Riyan Parag: బీసీసీఐ తీసుకున్న చర్యలు
నిబంధనల ఉల్లంఘనకు గాను పరాగ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు.ఫీజు కోతతో పాటు అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చారు.విచారణలో రియాన్ పరాగ్ తన తప్పిదాన్ని అంగీకరించడంతో తదుపరి విచారణ అవసరం లేకుండానే శిక్షను ఖరారు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
"బుమ్రా ఏమీ యంత్రం కాదు".. కీరన్ పొలార్డ్

