Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముంబై ఇండియన్స్ ఓటమితో కన్నీళ్లు పెట్టుకున్న నీతా అంబానీ..

ముంబై ఇండియన్స్ ఓటమితో కన్నీళ్లు పెట్టుకున్న నీతా అంబానీ..

వార్త 3 weeks ago

MI vs SRH IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ (MI) జట్టు వరుస ఓటములతో సతమతమవుతోంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

244 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌ పరాజయం తర్వాత ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ, భావోద్వేగానికి లోనైన దృశ్యాలు చర్చనీయాంశమయ్యాయి.

Read Also:Jasprit Bumrah: "బుమ్రా ఏమీ యంత్రం కాదు".. కీరన్ పొలార్డ్

సొంత మైదానమైన వాంఖడే స్టేడియంలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోవడం ముంబై చరిత్రలో ఇదే మొదటిసారి. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్, ఈ సీజన్‌లో వరుస ఓటములతో తీవ్ర ఆందోళనలో ఉంది.244 పరుగుల లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు సృష్టించిన పరుగుల విధ్వంసం చూసి ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ముంబై బౌలర్లు చేతులెత్తేయడం, సన్‌రైజర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆమె తన ఎమోషన్‌ను ఆపుకోలేకపోయారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha