Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
NH. 544డి పరిధిలో భూసమస్యలు పరిష్కరించాలి: జాయింట్ కలెక్టర్

NH. 544డి పరిధిలో భూసమస్యలు పరిష్కరించాలి: జాయింట్ కలెక్టర్

వార్త 2 months ago

Singanamala Land Issues: శింగనమల ఎన్.హెచ్ 544డి పరిధిలో నెలకొన్న అన్ని రకాల భూసమస్యలు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

బుధవారం అనంతపురం రూరల్ పరిధిలోని సోములదొడ్డి నుంచి తాడిపత్రి పరిధిలోని బుగ్గ వరకు ఎన్.హెచ్ 544డికి సంబంధించిన భూసేకరణ పనులను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఆయా మండలాల అధికారులు, రైతులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా శింగనమల మండల పరిధిలో ఎక్కడెక్కడ భూ సమస్యలు ఉన్నాయి,

Read Also: Jaladhara-Jalaharati Program Nellore: సమర్థవంతంగా జలధార-జలహారతి అమలు చేయాలి: కలెక్టర్ హిమాన్షు శుక్లా

Singanamala Land Issues

ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై జాయింట్ కలెక్టర్ క్షేత్రస్థాయికి వెళ్లి సమగ్ర పరిశీలన చేశారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్.హెచ్ 544డి పరిధిలో నెలకొన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. సకాలంలో భూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు అవార్డులను పాస్ చేయడం జరగగా, తొందర్లోనే పరిహారం వస్తుందని రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కేశవనాయుడు, ఎన్.హెచ్.ఏ.ఐ పిడి తరుణ్, తహసీల్దారు,శేషారెడ్డి, అయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఉపాధి పనులకు ఎక్కువ మంది కూలీలు వచ్చేలా చూడండి ఏంపీడీఓ మౌనిక

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha