Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు.. పారిపోయిన నిందితులు!

ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు.. పారిపోయిన నిందితులు!

వార్త 3 months ago

Hyderabad: ఐపీఎస్ అధికారి భార్య తనూజా రంజన్ హత్య, దోపిడీ కేసులో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులు నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎక్కి పరారైనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

Read Also : Jangaon Snake Bite Incident: నిద్రిస్తున్న బాలుడిని కాటేసిన రెండు విష పాములు

Hyderabad: దేశవ్యాప్తంగా గాలింపు చర్యలు

నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని పోలీస్ కమిషనర్ ఆదేశించగా, ఇందుకోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు చేరుకున్నాయి. ముంబై, లక్నో, ఢిల్లీ ఈ నగరాల్లో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులు దేశం దాటే అవకాశం ఉండటంతో, ప్రత్యేక బృందాలు ఇప్పటికే నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు చేరుకున్నాయి.

 IPS officer’s wife murder case.. accused absconding!

పనిమనిషి కల్పన గత చరిత్రపై ఆరా

ఈ కేసులో ప్రధాన అనుమానితురాలుగా భావిస్తున్న పనిమనిషి కల్పన నేపథ్యంపై పోలీసులు దృష్టి సారించారు. గతంలో లక్నోలో కల్పన పనిచేసిన ఇంటికి వెళ్లిన పోలీసులు, అక్కడి ఇంటి యజమానులను విచారించి ఆమె గురించి కీలక వివరాలు సేకరించారు. హత్య జరిగిన సమయంలో కల్పనతో పాటు ఉన్న ఇద్దరు యువకులు ఎవరనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విచారణలో భాగంగా పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. నిందితుల కదలికలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించారు. తనూజా రంజన్ నివాసం వద్ద, అలాగే నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో దొరికిన నిందితుల ఫోటోలను పోలీసులు అధికారికంగా విడుదల చేశారు. ప్రజలు వీరిని గుర్తించి సమాచారం అందించాలని కోరుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

స్కూల్ బస్సును ఢీకొన్న కారు.. డాక్టర్ విజయ్ కుమార్ మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha