Kalwakurthy Road Accident: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి సమీపంలో ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, ప్రజా వైద్యశాల నిర్వాహకులు అయిన డాక్టర్ విజయ్ కుమార్ ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు.
నిత్యం రోగుల ప్రాణాలు కాపాడే వైద్యుడు ఇలా అకాల మరణం చెందడం వైద్య ఆరోగ్య శాఖలో విషాదాన్ని నింపింది.
Read Also : Jangaon Snake Bite Incident: నిద్రిస్తున్న బాలుడిని కాటేసిన రెండు విష పాములు
Car hits school bus, Dr. Vijay Kumar dies
కల్వకుర్తి నుండి శ్రీశైలం వెళ్లే హైవే మార్గంలో సీబీఎం కళాశాల సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డాక్టర్ విజయ్ కుమార్ తన కారులో వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సు బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు తీవ్రంగా దెబ్బతింది. ప్రతిరోజూ ఉదయం షటిల్ ఆడటానికి వెళ్లే క్రమంలోనే ఈ విషాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
Kalwakurthy Road Accident: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, తీవ్రంగా గాయపడిన డాక్టర్ విజయ్ కుమార్‌ను చికిత్స నిమిత్తం కల్వకుర్తిలోని మహిత ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. తోటి వైద్యుడిని కాపాడుకోవడానికి సహచర డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

