Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐరా 'స్పా'  మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!

ఐరా 'స్పా' మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!

వార్త 1 month ago

Guntur News: గుంటూరు నగరంలో స్పా మరియు మసాజ్ సెంటర్ ముసుగులో సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలను జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్డు, రెడ్డిపాలెం సమీపంలో ఉన్న 'ఐరా స్పా' (Aira Spa) సెంటర్‌పై గురువారం సాయంత్రం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

కొంతకాలంగా ఇక్కడ మసాజ్ పేరుతో వ్యభిచార దందా జరుగుతోందని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.

Read Also: funds : వ్యయం జానెడు.. వ్యర్థం బారెడు!

 Prostitution racket at 'Aira Spa' center in Guntur city

Guntur News: నిందితుల అరెస్ట్, విచారణ

ఈ దాడుల్లో పోలీసులు స్పా మేనేజర్ సూర్య అనే వ్యక్తితో పాటు ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో, పట్టుబడిన మహిళల్లో ఇద్దరు ఇతర రాష్ట్రాలకు చెందిన వారని తేలింది. వీరికి వ్యభిచార దందాతో ఉన్న సంబంధాలపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. స్పా ముసుగులో అమాయక మహిళలను ఈ రొంపిలోకి దింపుతున్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది.

కేసు నమోదు

అదుపులోకి తీసుకున్న నలుగురిని తదుపరి విచారణ నిమిత్తం నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఈ దందా వెనుక ఇంకా ఎవరైనా పెద్ద తలకాయలు ఉన్నాయా అనే అంశంపై ఆరా తీస్తున్నారు. నగరంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఫలించిన మంత్రి లోకేష్ వ్యూహం.. పెరిగిన టెన్త్ ఉత్తీర్ణత శాతం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha