Dailyhunt
ఫలించిన మంత్రి లోకేష్ వ్యూహం.. పెరిగిన టెన్త్ ఉత్తీర్ణత శాతం

ఫలించిన మంత్రి లోకేష్ వ్యూహం.. పెరిగిన టెన్త్ ఉత్తీర్ణత శాతం

వార్త 1 week ago

AP SSC Results 2026: పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ఉత్తీర్ణత సాధించడం అనేది ఐకమత్యంగా, అంకిత భావంతో సాధించిన సమష్టి విజయమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అభిప్రాయ పడ్డారు.

ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇంకా సాధించాల్సింది చాలా ఉందని, అయితే అమలు చేసిన ప్రణాళికలు విజయవంతం కావడం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల్లో నైతిక విలువలు, సమగ్ర వికాసం కోసం మరింత కృషి చేయనున్నట్లు తెలిపారు.

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి సమాజ సహకారం ఎంతో అవసరమని ఆయన పిలుపునిచ్చారు. ఈ సంద ర్భంగా టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులం దరికీ అభినందనలు తెలియజేశారు. ఫెయిలైన వారు ఆత్మన్యూనతకు గురికావొద్దని, పట్టుదల తో ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చని భరోసా ఇచ్చారు. ఇక టెన్త్ పరీక్షా ఫలితాలపై ఏపీ విద్యాశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. టెన్త్ ఉత్తీర్ణత పెరగడానికి లోకేష్ 100రోజుల కార్యాచరణ ప్రణాళిక కారణమని వెల్లడించింది.

Read Also: Kadapa Crime: ఉద్యోగం రాలేదని బీటెక్ యువతి ఆత్మహత్య!

 Minister Lokesh’s strategy has paid off.. Tenth pass percentage has increased

AP SSC Results 2026: 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక

ఇందులో భాగంగా రూపొందిం చిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక సత్ఫలితాలనిచ్చిందని విద్యాశాఖ వివరించింది. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా 46 స్లిప్ టెస్టులు నిర్వహించారు. ఈ మార్కులను ‘లీప్’ మొబైల్ యాప్ నమోదు చేసి, విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వారిని షైనింగ్ స్టార్స్’, ‘రైజింగ్ స్టార్స్’గా గుర్తించారు. వారి వారి సామర్థ్యాలకు అనుగుణంగా ప్రత్యేక బోధన అందించారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

సాధనే విజయం

సాధనమున పనులు సమకూరు ధరలోన అన్న వేమన వాక్కును నిజం చేస్తూ, విద్యార్థులతో క్రమం తప్పకుండా సాధన చేయించడం వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇందుకోసం విద్యాశాఖ ప్రత్యేకంగా మోడల్ పేపర్లు, క్వశ్చన్ బ్యాంకులను ఉచితంగా అందించింది. ముఖ్యంగా, నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టుల కోసం ద్విభాషా (బైలింగ్యువల్) పద్ధతిలో, ఒకవైపు తెలుగు మరోవైపు ఇంగ్లీషులో ప్రశ్నపత్రాలు రూపొందించి ఇవ్వడం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడింది. ఏ ఒక్క అవకాశం జారకుండా డ్యాష్బార్డ్ విశ్లేషణ ద్వారా విద్యార్థుల బలాబలాలను ముందుగానే అంచనా వేశారు. దీనికి అనుగుణంగా ప్రతి పాఠశాలకు 15 కార్యాచరణ ప్రణాళిక పుస్తకాలను పంపిణీ చేశారు. స్లిప్ టెస్టులలో వెనుకబడిన విద్యార్థుల కోసం 30 రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ను ప్రత్యేకంగా నిర్వహించి, వారిపై దృష్టి సారించారు. పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రీఫైనల్, గ్రాండ్ టెస్టులు నిర్వహించారు.

అమలు చేసిన పథకాలు

ఈ కార్యాచరణ ప్రణాళికతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా విద్యార్థులకు అండగా నిలిచాయి. రుచికరమైన మధ్యాహ్న భోజనం. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రఖి పేరుతో యూనిఫాం, బ్యాగు, షూ, పుస్తకాలు వంటివి ఉచితంగా అందించారు. తల్లికి వందనంఖి పథకం ద్వారా తల్లులకు ఆర్థిక ప్రోత్సాహం కల్పించారు. ఈ సమన్వయ కృషి ఉత్తమ ఫలితాలకు బాటలు వేసింది. మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణ, అధికార యంత్రాంగం కృషి ఫలితంగా, మార్చి 2026 పదో తరగతి పరీక్షల ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగింది. గతేడాది 81.1 గా ఉన్న ఉత్తీర్ణత, ఈ ఏడాది 85.25 శాతానికి చేరింది. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఉత్తీర్ణత 72.8 నుంచి 78.39 శాతానికి పెరగడం విశేషం.

ఫలితాల్లో భళా బాలిక అన్పించుకున్న విద్యార్ధినీలు

ఈ ఏడాది ఫలితాల్లో బాలుర కంటే బాలికలు పైచేయి సాధించారు. బాలుర ఉత్తీర్ణత 82.68 శాతం కాగా, బాలికలు 87.90శాతం ఉత్తీర్ణతతో సత్తా చాటారు. బాలుర కంటే 5.22శాతం అధిక ఉత్తీర్ణత సాధించి భళా అనిపించు కున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సున్నా శాతం ఫలితాలు సాధించిన పాఠశాలలు 16 ఉండగా, వాటిలో 11 ప్రైవేట్ పాఠశాలలు కావడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలలు కేవలం 5 మాత్రమే ఈ జాబితాలో ఉన్నాయి. ఇది ప్రభుత్వ విద్య నాణ్యతకు నిదర్శనంగా నిలుస్తోందని విద్యా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

పమిడిముక్కలలో చెక్కులు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha