Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐటీబీపీలో మెడికల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఐటీబీపీలో మెడికల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

వార్త 16 hrs ago

ITBP Notification 2026: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP), హోమ్‌శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFs) విభాగాలలో ఖాళీగా ఉన్న గ్రూప్ 'ఎ' మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్, స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ హోదాల్లో మొత్తం 282 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన వారు ఆన్‌లైన్ లో చేసుకోవాల్సి ఉంటుంది.

Read Also : Arvind Kejriwal: నా ఖాతా ఎందుకు బ్లాక్ చేశారు? మెటా సంస్థపై మండిపడ్డ కేజ్రీవాల్!

 Notification released for Medical Officer posts in ITBP.

  • సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (సెకండ్-ఇన్-కమాండ్) 5 పోస్టులు
  • స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (డిప్యూటీ కమాండెంట్): 162 పోస్టులు
  • మెడికల్ ఆఫీసర్ (అసిస్టెంట్ కమాండెంట్): 115 పోస్టులు

ITBP Notification 2026: విద్యా అర్హతలు, దరఖాస్తు రుసుము

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి MBBS, సంబంధిత PG డిగ్రీ/డిప్లొమా లేదా సూపర్ స్పెషలైజేషన్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో నమోదు తప్పనిసరి.

  • దరఖాస్తు రుసుము: జనరల్, OBC, EWS వర్గాల పురుష అభ్యర్థులకు ₹400 దరఖాస్తు రుసుము ఉంటుంది. SC, ST, మహిళలు మరియు మాజీ సైనికోద్యోగులకు ఫీజు మినహాయింపు ఉంది.

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు, ఎంపిక విధానం

అర్హత ఉన్న అభ్యర్థులు 10 ఆగస్టు 2026 నుంచి 08 సెప్టెంబర్ 2026 (రాత్రి 11:59 గంటల) వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

  • దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఐటీబీపీ అధికారిక వెబ్‌సైట్ recruitment.itbpolice.nic.in ద్వారా మాత్రమే దరఖాస్తు సమర్పించాలి.
  • ఎంపిక విధానం: దరఖాస్తుల పరిశీలన (Scrutiny), పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ల పరిశీలన, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) మరియు వైద్య పరీక్షల (DME) ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలయ్యే సమగ్ర నోటిఫికేషన్‌ను చూడవలసిందిగా సూచించారు.

'డార్క్ ప్యాటర్న్స్' వినియోగంపై 9 డిజిటల్ సంస్థలకు కేంద్రం జరిమానా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha