Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'అక్కాయిలు బాగున్నారా' అంటున్న రవితేజ

'అక్కాయిలు బాగున్నారా' అంటున్న రవితేజ

వార్త 1 month ago

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో స్పీడ్ పెంచుతున్నారు. ఇటీవల సంక్రాంతికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆయన, ఇప్పుడు క్రేజీ డైరెక్టర్లతో సరికొత్త ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు.

తాజాగా హసిత్ గోలి దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. రవితేజ మరియు అగ్ర నిర్మాత దిల్ రాజు కాంబినేషన్లో గతంలో ‘భద్ర’ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమా వచ్చింది. వీరిద్దరూ కలిసి దాదాపు 9 ఏళ్ల క్రితం ‘రాజా ది గ్రేట్’ చిత్రం చేశారు. అప్పటి నుండి వీరి కాంబో కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు హసిత్ గోలి వినిపించిన ఒక వైవిధ్యమైన కథకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. మాస్ ఎలిమెంట్స్ తో పాటు హసిత్ మార్క్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

Read Also : May Day 2026: మేడేను జయప్రదం చేయండి: ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెహమాన్

క్రేజీ టైటిల్: ‘అక్కాయిలు బాగున్నారా?’

ఈ సినిమా కోసం పరిశీలిస్తున్న టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘అక్కాయిలు బాగున్నారా?’ అనే వెరైటీ టైటిల్‌ను మేకర్స్ లాక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా రవితేజ సినిమాలకు పవర్ ఫుల్ టైటిల్స్ ఉంటాయి, కానీ ఇలాంటి ఒక వినోదభరితమైన పేరును ఎంచుకోవడం వెనుక కథలో ఏదో కొత్తదనం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

బిజీగా మాస్ మహారాజా: ‘ఇరుముడి’ అప్‌డేట్

ప్రస్తుతం రవితేజ దర్శకుడు శివ నిర్వాణతో కలిసి ‘ఇరుముడి’ అనే యాక్షన్ ఎంటర్టైనర్‌పై దృష్టి సారించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 50 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అయ్యప్ప భక్తి నేపథ్యంలో సాగే ఎమోషనల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ‘ఇరుముడి’ పనులన్నీ పూర్తి చేసిన తర్వాత, రవితేజ హసిత్ గోలి ప్రాజెక్టును మొదలుపెట్టే అవకాశం ఉంది. వరుస సినిమాలతో రవితేజ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

పెంచలకోన బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha